గబ్బిలాల్లో 20 కొత్త వైరస్ లను గుర్తించిన శాస్త్రవేత్తలు..
సాక్షి లైఫ్ : ప్రస్తుత కోవిడ్-19 ఆందోళనల మధ్య చైనాలో మరో వైరస్ ముప్పు వెలుగులోకి వచ్చింది. చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని పండ్ల తోటల్లోని గబ్బిలాల్లో 20 కొత్త వైరస్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో రెండూ అత్యంత ప్రాణాంతకమైన నిఫా ,హెండ్రా వైరస్లకు జన్యుపరంగా అత్యంత దగ్గరగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.
ఇది కూడా చదవండి..టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి..తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
ప్రమాదం ఎక్కడంటే..?
గబ్బిలాల మూత్రపిండాల్లో: సాధారణంగా రెట్టలపై దృష్టి పెట్టే పరిశోధకులు, ఈసారి గబ్బిలాల మూత్రపిండాలను పరిశీలించగా ఈ వైరస్లు బయటపడ్డాయి. మూత్రం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
పండ్ల తోటల సమీపంలో: ఈ గబ్బిలాలు పండ్ల తోటల సమీపంలో ఉండటం వల్ల, కలుషితమైన పండ్లు లేదా నీటి ద్వారా మానవులకు లేదా పశువులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అధిక మరణాల రేటు: నిపా, హెండ్రా వైరస్లు సోకినవారిలో 70శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. వీటికి నిర్దిష్టమైన చికిత్స లేదా టీకాలు లేవు.
ఈ అధ్యయనం ప్రాథమికమైనదే అయినప్పటికీ, భవిష్యత్తులో మానవులకు వైరస్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గబ్బిలాల సంఖ్యను, వాటి ద్వారా సంక్రమించే ప్రమాదాలను నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
