అరుదైన వ్యాధుల చికిత్సకోసం నిమ్స్‌లో స్టెమ్ సెల్స్ పరిశోధన కేంద్రం..
సాక్షి లైఫ్ : నిమ్స్ (NIMS)(నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిలో త్వరలో అత్యంత అధునాతన స్టెమ్ సెల్స్ పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ కేంద్రాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం, స్టెమ్ సెల్ చికిత్సా విధానాన్ని ఎముకల మజ్జ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి, కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి అందిస్తున్నారు. ఈ కొత్త కేంద్రంలో ముఖ్యంగావెన్నెముక దిగువ భాగంలో త్రిభుజాకారపు గ్యాప్ (త్రియాంగులర్ స్పైనల్ గ్యాప్) సమస్యతో బాధపడేవారికి చికిత్స అందించనున్నారు.
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
మోకాళ్లు, వెన్నెముక నొప్పులతోపాటు కాలేయం దెబ్బతిన్న రోగులకు.గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఈ చికిత్స అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం, ఒక వ్యక్తి వ్యాధి తీవ్రత ఆధారంగా చికిత్సా ఖర్చు సుమారుగా రూ.1.70 లక్షల నుంచి రూ.2.33 లక్షల వరకు అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.ఈ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పేందుకు తైరాయిడ్స్ అంకుర సంస్థల సహకారంతో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.
గత ఏడాది నిమ్స్‌లోని ఆర్థోపెడిక్ విభాగంలోనే 500 మందికి పైగా రోగులకు మార్పిడి చికిత్సలు విజయవంతంగా చేశారు. భవిష్యత్తులో ఈ కేంద్రం ప్రపంచ స్థాయి ప్రయోగశాలల స్థాయికి చేరుకోవాలని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టెమ్ సెల్ చికిత్స ద్వారా కాలేయం, మోకాళ్లు, వెన్నెముక సమస్యలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈ కేంద్రం ప్రజలకు నాణ్యమైన చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలని నిమ్స్ ఆశిస్తోంది.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
