కొన్నిరకాల పండ్ల మీద స్టిక్కర్స్ ఎందుకు వేస్తారంటే..? 

షేర్ చేయండి:
కొన్నిరకాల పండ్ల మీద స్టిక్కర్స్ ఎందుకు వేస్తారంటే..? 

సాక్షి లైఫ్ : కొన్నిరకాల వస్తువులకు బార్ కోడ్ తో ఉన్న స్టిక్కర్ వేస్తుంటారు. అది మీరు చూసే ఉంటారు. అదేవిధంగా పండ్లకు కూడా స్టిక్కర్లు వేస్తారు.. దానికి కారణమేంటి..? ఇతర రాష్ట్రాల్లో పండే పండ్లకు మాత్రమే అలా స్టిక్కర్లు ఉంటాయా..? లేదంటే..? కొన్నిరకాల జాతి పండ్లకు మాత్రమే ఇలాంటి స్టిక్కర్లు వేస్తారా..? అసలు ఫ్రూట్స్ కు స్టిక్కర్స్ వేయడానికి కారణమేంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఎఫ్ఎస్ఎస్ఏఐ..
 
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పండ్లపై అంటించే స్టిక్కర్ల గురించి ఆసక్తికర ప్రకటన చేసింది. పండ్లపై స్టిక్కర్లు అతికించడానికి ప్రధానకారణాలు ఏమిటి..? ఆయా స్టిక్కర్లను అతికించడం వెనక అర్థాన్ని విపులంగా తెలిపింది. పండ్ల నాణ్యత ఎంత..? ధర ఎంత..? వీటితోపాటు పండ్లను ఏ పద్దతిలో పండించారనే అంశాలను గురించి ఈ స్టిక్కర్లు సూచిస్తాయని ఫుడ్‌ సేఫ్టి అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. 

 9తో మొదలైతే ఆ పండ్లు.. 

ఐతే పండ్లకు అతికించే స్టిక్కర్ల విషయంలో అనేక రకాలు ఉన్నాయి. ఈ స్టిక్కర్ల పై ఐదు నంబర్లు ఉంటాయి. ఇవి 9తో మొదలైతే ఆ పండ్లు ఎలాంటి పురుగుమందులు లేకుండా సహజంగా పండించారని అర్థం, అదే కోడ్ ఐదు నంబర్లు ఉండి 8తో స్టార్ట్ అయితే ఆ ఫ్రూట్స్ సగం ఆర్గానిక్, సగం కెమికల్స్ వినియోగించినట్లని అర్థం చేసుకోవాలి.

 నాలుగుతో ప్రారంభమైతే.. 

ఒకవేళ నాలుగు నంబర్లు ఉండి, అది నాలుగుతో ప్రారంభమైతే అది పూర్తిగా రసాయనాలు, పురుగుమందులతో పండించారని గ్రహించాలి. ఒకవేళ  స్టిక్కర్లపై ఎటువంటి నంబర్లు లేకపోతే మార్కెట్లో అమ్మకం దారులు మోసం చేస్తున్నారని తెలుసుకోవాలి. ఈ క్రమంలో పండ్లను కొనుగోలు చేసే సమయంలో ఆలోచించి కొనుగోలు చేయడం మంచిది. వినియోగదారుల అవగాహనకోసమే పండ్లపై ఇలాంటి స్టిక్కర్స్ అతికిస్తారని ఫుడ్‌ సేఫ్టి అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తెలిపింది. 

ఇది కూడా చదవండి.. నాన్ వెజ్ విషయంలో ఎలాంటివి తీసుకోకూడదు..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.   

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.