Summer Heat effect : హైదరాబాద్ లో పెరుగుతున్న అజీర్తి, ఇన్ఫెక్షన్లు, అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎన్నడూలేనంతగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 40 డిగ్రీల భానుడి భగభగలు.. సాయంత్రం అకాల వర్షాలతో ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు సంభవిస్తున్నాయి. ఈ అస్థిర వాతావరణం నగరవాసుల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజులుగా నగరంలోని ఆసుపత్రుల్లో గ్యాస్ట్రిక్, అజీర్తి సంబంధిత కేసులు 20 నుంచి 30 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

వాతావరణంలో తేమ (Humidity) పెరగడం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల వల్ల ఆహారం, నీటిలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతోంది. వాతావరణ పీడనంలో మార్పుల వల్ల హెచ్. పైలోరీ (H. pylori), సాల్మొనెల్లా (Salmonella) వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.

వేడి వల్ల వండిన పదార్థాలు త్వరగా పాడవుతున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, తీవ్రమైన విరేచనాలు (ADD) వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు వీటి బారిన ఎక్కువగా పడుతున్నారని న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ చీఫ్ డా.అంకితా శ్రీవాస్తవ చెబుతున్నారు.

ఐటీ కారిడార్‌లో 'హీట్ గ్యాస్ట్రిటిస్'.. 

హైదరాబాద్‌లోని ఐటీ రంగంలో పనిచేసే వారిలో హీట్ గ్యాస్ట్రిటిస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పని ఒత్తిడి వల్ల సమయానికి భోజనం చేయకపోవడం, అధికంగా కెఫిన్ (టీ, కాఫీ) తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్య వస్తోంది. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మలబద్ధకం, పైల్స్, ఫిషర్స్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

స్వీయ వైద్యం.. ప్రమాదకరం..!

తలనొప్పి లేదా కడుపునొప్పి రాగానే మెడికల్ షాపులకు వెళ్లి సొంతంగా యాంటీబయాటిక్స్ వాడటం పెద్ద తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ అజీర్తి అనుకునే లక్షణాలు ఒక్కోసారి టైఫాయిడ్ లేదా ఇతర పారాసిటిక్ ఇన్ఫెక్షన్లకు సంకేతం కావచ్చు. సిబిసి (CBC), సిఆర్‌పి (CRP), స్టూల్ కల్చర్ వంటి పరీక్షల ద్వారా అసలు సమస్యను గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేదంటే బాడీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగి, భవిష్యత్తులో మందులు పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది.

ఆరోగ్య సూత్రాలు పాటించండి..

వేసవి కాలంలో జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కేవలం నీరు మాత్రమే కాకుండా ఓఆర్‌ఎస్ (ORS), మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. బయటి దొరికే పచ్చి సలాడ్లు, కట్ చేసిన పండ్లకు దూరంగా ఉండాలి. ఎప్పుడూ వేడిగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి. మలబద్ధకం దరిచేరకుండా ఉండాలంటే పీచు (Fibre) అధికంగా ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి. 'ఇండియా గట్ హెల్త్ రిపోర్ట్ 2026' ప్రకారం దేశంలో 82శాతం మంది అసిడిటీతో బాధపడుతున్నా, కేవలం కొద్దిమంది మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారు. నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక దశలోనే పరీక్షలు చేయించుకోవడం మేలు.

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.