సీజనల్ వ్యాధుల నివారణకు సర్వే నిర్వహించాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ 

షేర్ చేయండి:
సీజనల్ వ్యాధుల నివారణకు సర్వే నిర్వహించాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ 

సాక్షి లైఫ్ : సీజనల్ వ్యాధుల నివారణకు సర్వే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. రోజురోజుకి సీజనల్ వ్యాధులు పెరుగుతుండడంతో ఆయన ప్రజల ఆరోగ్య సంరక్షణ చర్యలపై దృష్టి సారించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ లను ఆదేశించారు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?  

సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా మలేరియా, డెంగ్యూ ఫీవర్ లను అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించాలని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యాధికాలను ఆదేశించారు. 

వైరల్ ఫీవర్ ల నివారణకు అవసరమైన మందులను ఇంటింటికి తిరిగి జన సర్వే నిర్వహించి అవసరమైన బాధితులకు మందులు అందించాలని మంత్రి రాజ నరసింహ అధికారులను, వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి కష్ట సమయంలో సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అండగా నిలవాలని ఆయన కోరారు.

 ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

 

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.