Telangana Health Department : తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం..
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు, బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే ప్రతి క్యాన్సర్ కేసును 'నోటిఫైడ్ డిసీజ్ 'గా గుర్తిస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న కేసులను కచ్చితంగా ట్రాక్ చేయడం ద్వారా సరైన చికిత్సా వ్యూహాలను రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం జీవో నం. 17ను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఒకే గొడుగు కిందకు గణాంకాలు..
ఇప్పటి వరకు నిమ్స్ (NIMS), ఎంజే (MNJ) వంటి కొన్ని ప్రభుత్వ సంస్థల్లో మాత్రమే క్యాన్సర్ రిజిస్ట్రీలు అందుబాటులో ఉండేవి. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఎక్కడ కేసు నమోదైనా ఆ డేటా మొత్తం ఒకే వ్యవస్థ పరిధిలోకి రానుంది. నిర్ధారణ అయిన 30 రోజుల్లోపు సంబంధిత వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలి. రోగుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూనే, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అన్ని ఆసుపత్రుల్లో తప్పనిసరి..
ఈ నిబంధన కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే కాకుండా రాష్ట్రంలోని అన్ని రకాల వైద్య సంస్థలకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోమ్‌లు, ఆయుష్ (AYUSH) కేంద్రాలు, ఎయిమ్స్ (AIIMS), ఈఎస్ఐ (ESI), రైల్వే, మిలిటరీ ఆసుపత్రులు. అన్ని రకాల పాథాలజీ, రేడియాలజీ ల్యాబొరేటరీలు.
నోడల్ కేంద్రంగా ఎంజే ఆసుపత్రి..
హైదరాబాద్‌లోని మెహదీ నవాజ్ జంగ్ (MNJ) క్యాన్సర్ ఆసుపత్రిని స్టేట్ నోడల్ సెంటర్‌గా ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సమాచారాన్ని ఈ కేంద్రం విశ్లేషిస్తుంది. ఐసీఎంఆర్ (ICMR) ప్రమాణాల ప్రకారం ఈ గణాంకాలను జాతీయ రిజిస్ట్రీకి కూడా అనుసంధానిస్తారు. దీనివల్ల ఏయే ప్రాంతాల్లో ఏ రకమైన క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి? మరణాల రేటు ఎంత? వంటి అంశాలపై స్పష్టత రానుంది.
విశ్వసనీయమైన గణాంకాలు ఉన్నప్పుడే ..!
విశ్వసనీయమైన గణాంకాలు ఉన్నప్పుడే భవిష్యత్తులో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను, చికిత్సా విధానాలను సమర్థవంతంగా రూపొందించగలమని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చోంగ్తూ అన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు (DMHO) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఇప్పటికే నమోదైన ఆసుపత్రులకు లాగిన్ వివరాలు పంపిస్తామని, కొత్తవారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
