వరల్డ్ సికిల్ సెల్ డే చరిత్ర, ప్రాముఖ్యత..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సికిల్ సెల్ అనేది జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి విషయంలో వ్యక్తి శరీరంలో ఎర్ర రక్త కణాల లోపం తలెత్తుతుంది. ఈ వ్యాధిని సికిల్ సెల్ అనీమియా అని కూడా అంటారు. సికిల్ సెల్ డిజార్డర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. సికిల్ సెల్ అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి. ఈ సారి ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని ఈ థీమ్‌తో జరుపుకుంటున్నారు..? అసలు  వరల్డ్ సికిల్ సెల్ డే ఎలా ప్రారంభమైంది...? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?

వరల్డ్ సికిల్ సెల్ డే చరిత్ర, ప్రాముఖ్యత.. 

ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 19న జరుపుకుంటారు. సికిల్ సెల్ డిసీజ్ జన్యుపరమైన వ్యాధి. ఇందులో ఎర్రరక్తకణాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి కణాల ఆకారం గుండ్రంగా ఉండదు. దీని కారణంగా ఈ కణం అర్ధ చంద్రాకారం లేదా కొడవలిలా కనిపిస్తుంది. అందుకే దీన్ని సికిల్ సెల్ అంటారు. దీని వల్ల పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. 

అంతేకాకుండా, ఇతర పిల్లలతో పోలిస్తే అతని రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా ఉంటుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే, అది కూడా ప్రాణాంతకం కావచ్చు. వీటన్నింటిపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. భారతదేశంలో ఈ వ్యాధి ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తూర్పు గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ ఒడిశా, ఉత్తర తమిళనాడులో ప్రబలంగా ఉంది.


వరల్డ్ సికిల్ సెల్ డే 2024 థీమ్

ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ సికిల్ సెల్ డే థీమ్- ' హోప్ త్రూ ప్రోగ్రెస్: ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్సింగ్ సికిల్ సెల్ కేర్ ' థీమ్ తో నిర్వహిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

 

ఇది కూడా చదవండి.. మ‌తిమ‌రుపునకు చికిత్స సాధ్య‌మేనా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.