Best Iron-Rich Foods : రక్తహీనతకు చెక్ పెట్టి పెట్టి.. ఐరన్ ను పెంచే బెస్ట్ ఫుడ్స్..!
సాక్షి లైఫ్ : శరీరంలో రక్తం (hemoglobin) తక్కువగా ఉందా..? తరచూ నీరసం, అలసట, తలతిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పాలిపోవడం లాంటివి వేధిస్తున్నాయా..? ఐతే మీలో ఐరన్ లోపం ఉన్నట్లే.. శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే హీమోగ్లోబిన్ తయారీకి ఐరన్ (Iron) అత్యంత కీలకం. దీని లోపం వల్ల రక్తహీనత (anemia) తలెత్తుతుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, గర్భిణుల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో ఎలాంటి పదార్థాలను చేర్చుకుంటే శరీరానికి తగినంత ఐరన్ అందుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
1. పాలకూర..
శాకాహారులకు పాలకూర అద్భుతమైన ఐరన్ వనరు. ఇందులో ఐరన్‌తో పాటు ఫోలేట్, ఫైబర్, పలు రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని పప్పులో వేసుకుని లేదా కూర, సూప్ రూపంలో తీసుకోవచ్చు. పాలకూర తినేటప్పుడు కాస్త నిమ్మరసం యాడ్ చేస్తే, అందులోని ఐరన్‌ను శరీరం మరింత సులభంగా గ్రహిస్తుంది.
2. బీట్‌రూట్..
బీట్‌రూట్‌లో ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది అద్భుతమైన పోషకాహారం. అయితే ఐరన్ లోపానికి ఇది ఒక్కటే పరిష్కారం కాదు, సమతుల్య ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవాలి. బీట్‌రూట్‌ను సలాడ్, కూర లేదా జ్యూస్ రూపంలో డైట్‌లో చేర్చుకోవచ్చు.
3. దానిమ్మ..
దానిమ్మలో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. హీమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచ డంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అయితే దానిమ్మను జ్యూస్ రూపంలో తాగడం కంటే, నేరుగా గింజలను తినడమే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
4. ఖర్జూరం..
ఖర్జూరంలో ఐరన్, ఫైబర్, పొటాషియం మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా ఐరన్ శాతాన్ని పెంచుతాయి. రోజూ స్నాక్స్‌గా రెండు, మూడు ఖర్జూరాలను తినడం అలవాటు చేసుకోవాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవాలి.
5. నువ్వులు, గుమ్మడి గింజలు..
నువ్వులు, గుమ్మడికాయ గింజలు ఐరన్‌కు మంచి వనరులు. వీటిలో ప్రొటీన్, మెగ్నీషియం, ఇతర మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. వీటిని సలాడ్స్ లేదా స్మూతీస్‌లో కలుపుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
