సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?

సాక్షి లైఫ్ : ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం (వరల్డ్ సికిల్ సెల్ డే 2024) ప్రతి సంవత్సరం జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది ఎర్ర రక్త కణాల రుగ్మతకు సంబంధించిన వ్యాధి. ఇది రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్‌ పై ప్రభావం చేస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో శరీరంలో ఎర్ర రక్త కణాల లోపం కారణంగా ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది.

ఇది కూడా చదవండి..చర్మ సౌందర్యాన్ని సంరక్షించే ఫుడ్..

ప్రపంచ సికిల్ సెల్ డే 2024: ప్రపంచ సికిల్ సెల్ అవేర్‌నెస్ డే ప్రతి సంవత్సరం జూన్ 19న జరుపుకుంటారు. ఇది ఎర్ర రక్త కణాలను (ఆర్బీసీ) ప్రభావితం చేసే జన్యు రక్త రుగ్మత. ముఖ్యంగా ఎర్రరక్త కణాల లోపం కారణంగా ఆక్సిజన్ శరీర భాగాలకు సరిగ్గా చేరదు. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. 


అసలు ఏంటీ ఈ వ్యాధి..?

ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసే ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే వస్తుంది. దీనిలో ఎర్ర రక్త కణాల ఆకారం మారిపోతుంది.  దీని వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించదు, ఎందుకంటే హిమోగ్లోబిన్‌లో అసాధారణమైన గొలుసులు ఏర్పడడంతో సికిల్ సెల్ ఎనీమియా, సికిల్ సెల్ తలసేమియా వంటి వ్యాధులు వస్తాయి. అందువల్ల, సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : physical-health anemia red-blood-cells blood white-blood-cells world-sickle-cell-day-2024 world-sickle-cell-day sickle-cell-day-2024 sickle-cell world-sickle-cell-awareness-day world-sickle-cell-awareness-day-2024 world-sickle-cell-awareness-day-24
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com