డెంగ్యూ రెండవ వ్యాక్సిన్ ను ఆమోదించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్  

షేర్ చేయండి:
డెంగ్యూ రెండవ వ్యాక్సిన్ ను ఆమోదించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్  

సాక్షి లైఫ్ : రెండవ డెంగ్యూ వ్యాక్సిన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ హెచ్ ఓ) నుంచి ఆమోదం పొందింది. జపనీస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా వ్యాక్సిన్‌ను తయారు చేసింది. డెంగ్యూ వ్యాక్సిన్ జపనీస్ ఫార్మాస్యూటికల్ టకేడా తయారు చేసిన డెంగ్యూ వ్యాక్సిన్‌ను ఆమోదించినట్లు యూఎన్ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. డెంగ్యూ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ఆరు నుంచి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో దీనిని ఉపయోగించవచ్చని సిఫార్సు చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ నాలుగు రకాల డెంగ్యూల నుంచి రక్షిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది.

ఇది కూడా చదవండి.. ఎండకాలంలో పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యం కోసం..  

 డెంగ్యూ వ్యాక్సిన్..

రెండో డెంగ్యూ వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ఆమోదించింది. ఇది దోమల వల్ల కలిగే వ్యాధి నుంచి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు రక్షణ కల్పించే చర్య. ఈ సంవత్సరం ఇప్పటికే డెంగ్యూ వ్యాప్తి అమెరికా అంతటా వ్యాపించింది. 

యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ..
 
టకేడా డెంగ్యూ వ్యాక్సిన్ గతంలో 2022లో యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ద్వారా కూడా ఆమోదం పొందింది. ఇప్పుడు WHO ఆమోదం పొందింది కాబట్టి ఇతర UN ఏజెన్సీలు పేద దేశాలకు వ్యాక్సిన్‌లను కొనుగోలు చేయవచ్చు. డెంగ్యూ సోకితే ఆసుపత్రిలో చేరకుండా నిరోధించడంలో టేకేడా వ్యాక్సిన్ 84 శాతం ప్రభావవంతంగా ఉందని , లక్షణాలను నివారించడంలో 61 శాతం మేర పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి.. క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?   

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.