టీబీ రోగులకు ఇచ్చే రేషన్‌ను ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..
సాక్షి లైఫ్ : జార్ఖండ్‌లో టీబీరోగులకు ఇచ్చే రేషన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ప్రశంసించింది. పోషకాహారాన్ని మెరుగుపరచ డమే కాకుండా, మరణాలను తగ్గించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అధ్యయనంలో తేలింది. ఈ రేషన్ ఆగ్నేయాసియా దేశాలకు ఒక ఆదర్శ నమూనా అని కూడా అభివర్ణించింది డబ్ల్యూ హెచ్ఓ. ఆగ్నేయాసియా దేశాలను ఇటువంటి వ్యూహాలను అవలంబించాలని డబ్ల్యూ హెచ్ఓ పిలుపునిచ్చింది. ఆరోగ్య మంత్రి దీనిని ఒక పెద్ద విజయంగా అభివర్ణించారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఐసిఎంఆర్ నిర్వహించిన అధ్యయన నివేదిక ఆధారంగా డబ్ల్యూ హెచ్ఓ ఈ పథకాన్ని ప్రశంసించింది. ఈ అధ్యయన నివేదిక 2023లో ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మ్యాగజైన్‌లో "రేషన్లు" పేరుతో ప్రచురించారు.
జార్ఖండ్‌లోని టిబి రోగులపై ఐసిఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో టిబి రోగులకు పోషకాహారం అందించడం వల్ల చికిత్స ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, మరణాలు తగ్గాయని తేలింది.
ఆహార రేషన్ పొందిన రోగులు ప్రామాణిక సంరక్షణ పొందిన వారి కంటే మెరుగైన కోలుకోవడం,మనుగడ రేటును చూపించారు. దీని ప్రభావాన్ని గుర్తించిన డబ్ల్యూ హెచ్ఓ, ఆగ్నేయాసియా ప్రాంతంలోని దేశాలు ప్రపంచ టిబి నిర్మూలన లక్ష్యాలను చేరుకోవడానికి ఇలాంటి వ్యూహాలను అనుసరించాలని పిలుపునిచ్చింది.
జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ మాట్లాడుతూ.. ఇది జార్ఖండ్‌కు మాత్రమే కాకుండా మొత్తం దేశానికే గర్వకారణమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని టిబి రహితంగా మార్చడానికి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది, దీనిలో మందులతోపాటు, పోషకాహారం, అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం కూడా జార్ఖండ్ చొరవను ప్రశంసించింది. నిరంతర మద్దతును అందించింది.
నాలుగు గిరిజన జిల్లాల్లో అధ్యయనం..
16 ఆగస్టు 2019, 31 జనవరి 2021 మధ్య రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు శాంతల్, హో, ముండా, ఒరాన్, భూమిజ్ లలో ఈ అధ్యయనాన్ని ఐసిఎంఆర్ నిర్వహించింది. రేషన్ పొందుతున్న రోగుల ఆరోగ్యం వేగంగా మెరుగుపడిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
టీబీ రోగులు ఆరు నెలల పాటు ఆహార రేషన్ (1200 కిలో కేలరీలు, సూక్ష్మపోషకాలతో రోజుకు 52 గ్రాముల ప్రోటీన్) తీసుకున్నారని అధ్యయన నివేదిక పేర్కొంది. రోగులు నెలవారీ ఫుడ్ రేషన్ ,సూక్ష్మపోషకాలు (750 కిలో కేలరీలు, సూక్ష్మపోషకాలతో రోజుకు 23 గ్రాముల ప్రోటీన్) తీసుకున్నారు.
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
