బర్డ్ ఫ్లూతో వ్యక్తి మృతి.. చికెన్ తినకూడదా..?
సాక్షి లైఫ్ : ఇటీవల బర్డ్ ఫ్లూ సోకడం వల్ల ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కారణంగా మనిషి చనిపోవడం ప్రపంచంలోనే మొదటి సారి. మెక్సికోలో బర్డ్ ఫ్లూతో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచదేశాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్5ఎన్1) బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పక్క రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.
ఇది కూడా చదవండి.. లివర్ హెల్త్ కు ఎమోషన్స్ కు లింక్ ఏంటి..?
బర్డ్ ఫ్లూతో మెక్సికోలో 59 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ హెచ్ ఓ) ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. అందులోభాగంగా తెలంగాణ ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన వివరాల ప్రకారం 59 ఏళ్ల వ్యక్తి కొన్నిరోజులుగా విపరీతమైన జ్వరంతోపాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అతిసారం, వికారం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు వెల్లడించింది. పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే వాళ్లంతా బర్డ్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూ హెచ్ ఓ సూచించింది.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
