అమెరికాలో పాలిచ్చే ఆవులలో బర్డ్ ఫ్లూ వైరస్..  

షేర్ చేయండి:
అమెరికాలో పాలిచ్చే ఆవులలో బర్డ్ ఫ్లూ వైరస్..  

సాక్షి లైఫ్: అమెరికాలో బర్డ్ ఫ్లూ వైరస్ పెరుగుతోంది. పాశ్చరైజ్డ్ పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ అవశేషాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన నమూనాలను పరీక్షలకోసం ల్యాబ్ కు పంపగా.. అమెరికా లోని కొన్ని పాశ్చరైజ్డ్ పాల నమూనాలలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఏ) పేర్కొంది. అయితే, పాలు వినియోగానికి అనుకూలంగా ఉన్నాయో లేదో నిర్ధారించడానికి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

బర్డ్ ఫ్లూ (H5N1)

అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన పరిశోధనల ప్రకారం పాలలో కనిపించిన బర్డ్ ఫ్లూ వైరస్ అవశేషాలు వినియోగదారులకు ముప్పు కలిగించవని ఎఫ్‌డిఏ తెలిపింది. బర్డ్ ఫ్లూ (H5N1) అమెరికాలోని అనేక రాష్ట్రాలలోని పాలిచ్చే ఆవులలో మొదటిసారి కనుగొన్నారు. ఈ వైరస్ ఇప్పటికే దాదాపు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది.
 
ఇంతకీ ఏం తెలిసింది.. ?
 
USDA డేటా ప్రకారం ఇడాహో, న్యూ మెక్సికో, టెక్సాస్, సౌత్ డకోటా, కాన్సాస్, మిచిగాన్, ఒహియో, నార్త్ కరోలినాలో ఆవుల్లో బర్డ్ ఫ్లూ వైరస్  ఉన్నట్లు కనుగొన్నారు. పాలల్లో బర్డ్ ఫ్లూ ఉంటే..? ఎలాంటి ప్రభావం ఉంటుందనేదానిపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ  ఫలితాలు కొద్ది రోజుల్లో రానున్నాయి.

 ఇది కూడా చదవండి.. గుడ్డు పచ్చసొన అంటే పసుపు భాగం తినకూడదా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.