రాగల మూడురోజుల్లో వాతావరణ సూచన..
సాక్షి లైఫ్: తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ వాతావరణ హెచ్చరికలు.. ఇలా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వడగాడ్పులు వీచాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలను వేసవితాపాన్ని తట్టుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు వాతావరణ అధికారులు.
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
రాగల మూడురోజులకు వాతావరణ సూచన..
ఈ రోజు, రేపు ,ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ వడగాల్పులు వీయగా.. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది" అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి.. ఉగాది పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
