ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏ ఉద్దేశ్యంతో ప్రారంభించారు..?  

షేర్ చేయండి:
ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏ ఉద్దేశ్యంతో ప్రారంభించారు..?  

సాక్షి లైఫ్: మనిషికి అందుబాటులో ఉన్న వైద్య విధానాల్లో హోమియో పతి కూడా ఒకటి. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. డాక్టర్ శామ్యూల్ హానెమాన్ హోమియోపతి వ్యవస్థాపకుడు. ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం హోమియోపతి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. 2005లో మొదటిసారిగా ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుంచి వరల్డ్ హోమియో డేని ప్రతి ఏటా జరుపుతున్నారు. హోమియోపతి ఎటువంటి దుష్ప్రభావాలు లేని చికిత్సగా పరిగణిస్తారు.

 ఇది కూడా చదవండి.. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాలో ఎన్ని రకాలున్నాయంటే..?  

చాలా సంవత్సరాలుగా..


హోమియోపతి అనేది శరీరం స్వయంగా స్వస్థత పొందగలదని విశ్వసించే వైద్య విధానం. చాలా సంవత్సరాలుగా హోమియోపతి మందుల ద్వారా వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. అయితే  కరోనా తర్వాత, ప్రజలు ఈ చికిత్సను ఎక్కువగా అవలంబిస్తున్నారు. దీనికి ఒక కారణం ఏమిటంటే..? ఈ మందులు వాడినా దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉండడమే. ప్రపంచవ్యాప్తంగా అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, నేచురోపతి అనే నాలుగు రకాల వైద్య విధానాలను పలురకాల వ్యాధుల చికిత్సకు అవలంబిస్తున్నారు. హోమియో చికిత్స 1700ల చివరలో జర్మనీలో అభివృద్ధి చేశారు. దీనిని ఇప్పటికీ అనేక యూరోపియన్ దేశాలు అనుసరిస్తున్నాయి. భారతదేశంలో కూడా, హోమియోపతి మందులు చాలా మందికి వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

  ప్రపంచ హోమియోపతి దినోత్సవం చరిత్ర.. 

ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న జర్మనీ వైద్యుడు, రసాయన శాస్త్రవేత్త డాక్టర్ శామ్యూల్ హానెమాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటారు. ఈయననే హోమియోపతి వ్యవస్థాపకుడుగా భావిస్తారు. 1755 నుంచి 1843 విస్తృతంగా ప్రాచుర్యం పొందిన తర్వాత హోమియోపతి మొదటిసారిగా 19వ శతాబ్దంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే దీని మూలాలు క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందినవి.  శామ్యూల్ హానెమాన్ వైద్య పద్ధతులు, శరీరంపై దుష్ప్రభావాలను కలిగించవు. ఈ ఆలోచన వైద్యరంగంలో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ప్రపంచ హోమియోపతి దినోత్సవం 2024 థీమ్.. 

ప్రతి రోజు ఈ రోజును ఒక ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో “హోమియోపరివార్: ఒక ఆరోగ్యం, ఒక కుటుంబం” అనే థీమ్ తో ఈ ఏడాది ప్రపంచ హోమియోపతి దినోత్సవం జరుపుతున్నారు. మరింతమందికి హోమియో మందులు అందించడం ద్వారా ఆరోగ్యకుటుంబాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఉద్దేశ్యం.. 

ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రధాన లక్ష్యం ఈ విభిన్న వైద్య విధానం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం, తద్వారా ఎక్కువ మంది ప్రజలు దాని ప్రయోజనాలను అందించడం.

ఇది కూడా చదవండి.. మేనరికం సంబంధాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.