ఏవియన్ ఇన్ఫ్లుఎంజాలో ఎన్ని రకాలున్నాయంటే..?
సాక్షి లైఫ్ : బర్డ్ ఫ్లూను, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ఒక రకమైన ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ), ఇది ఎక్కువగా అడవి నీటి పక్షులకు, కోళ్లు ,ఇతర పక్షులకు, జంతువులకు సోకుతుంది. ఇది ఇన్ఫ్లుఎంజా ఏ రకం వైరస్. అంతే కాదు బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకుతుంది. అయినప్పటికీ, దాని కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయి. మానవులను ప్రభావితం చేసే అత్యంత సాధారణ ఉప రకాలు ఏ (హెచ్5ఎన్ 1), ఏ(హెచ్7 ఎన్9), ఏ (హెచ్ 9ఎన్2). దీని లక్షణాలు తేలికపాటి నుంచి తీవ్రమైన ఫ్లూ లాంటి అనారోగ్య లక్షణాలు ఉండవచ్చు. వీటికారణంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి.
ఇది కూడా చదవండి.. క్యాన్సర్ కు సరికొత్త ఔషధం.. పరిశోధనలో గొప్ప విజయం..రూ.100కే టాబ్లెట్..
A(H5) వైరస్‌లలో తొమ్మిది ఉప రకాలు ఉన్నాయి. ఏ(హెచ్5ఎన్1), ఏ(హెచ్5ఎన్2), ఏ(హెచ్5ఎన్3), ఏ(హెచ్5ఎన్4), ఏ(హెచ్5ఎన్5), ఏ(హెచ్5ఎన్6), ఏ(హెచ్5ఎన్7), ఏ(హెచ్5ఎన్8 ),ఏ(హెచ్5ఎన్9). అడవి పక్షులు, పౌల్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన వాటిలో ఏ(హెచ్5) వైరస్‌లు LPAI, కానీ అప్పుడప్పుడు HPAI A(H5) వైరస్‌లు కనుగొన్నారు.
బర్డ్ ఫ్లూ లక్షణాలు..?
విరేచనాలు
దగ్గు
వాంతులు
కళ్ళు ఎర్రగా అవ్వడం
గొంతు మంట
ముక్కు కారటం
శరీరం,కండరాల నొప్పి
తీవ్రమైనజ్వరం
బర్డ్ ఫ్లూ తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలను కూడా కలిగిస్తుంది.
వీటిలో..
న్యుమోనియా,
శ్వాసకోశ వైఫల్యం
తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు
శ్వాస ఆడకపోవడం
ఇది కూడా చదవండి.. బలమైన ఎముకల కోసం హెల్తీ ఫుడ్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
