ప్రపంచ భూమి దినోత్సవం 2024: ఈ ఏడాది 'వరల్డ్ ఎర్త్ డే' థీమ్‌ ఏంటంటే..?  

షేర్ చేయండి:
ప్రపంచ భూమి దినోత్సవం 2024: ఈ ఏడాది 'వరల్డ్ ఎర్త్ డే' థీమ్‌ ఏంటంటే..?  

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22ని ప్రపంచ ఎర్త్ డేగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రధాన లక్ష్యం భూమి, ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, పర్యావరణాన్ని కాపాడటం, దానిని మెరుగుపరచడం. అసలు ఈ వరల్డ్ డే ఎప్పటి నుంచి ప్రారంభమైంది..? ఈ సంవత్సరం థీమ్ ఏమిటో తెలుసుకుందాం.
 
 ఇది కూడా చదవండి.. మెదడుకు ఆక్సిజన్ ఎంతసేపటి వరకూ అందకపోతే డ్యామేజ్ అవుతుంది..? 


 ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్.. 

 ప్రపంచ భూమి దినోత్సవం 2024: ప్రపంచ భూమి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. భూమి మానవులకే కాదు లక్షలాది జంతువులు, మొక్కలకు, ఇతర ప్రాణులకూ నిలయం. కానీ మనుషులు తమ అవసరాలను తీర్చుకోవడానికి భూమికి అనేక రకాల హాని కలిగిస్తున్నారు. దీని వల్ల వరదలు, కాలుష్యం, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. 

ఇప్పటికైనా ఈ సమస్యలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో మనిషి మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి భూమి ,ప్రకృతి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ భూమి దినోత్సవాన్ని జరుపుకుంటారు.


 ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?  

ఎర్త్ డే ఎలా ప్రారంభమైంది..?

1969లో యునెస్కో సదస్సులో శాంతి కార్యకర్త జాన్ మెక్‌కానెల్ తొలిసారిగా ఎర్త్ డే జరుపుకునే ఆలోచనను ప్రతిపాదించారు. ప్రారంభంలో ఈ రోజును జరుపుకోవడం ఉద్దేశ్యం భూమిని గౌరవించడం. ఏప్రిల్ 22, 1970న మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌లో ఎర్త్ డే జరుపుకున్నారు. 1990లో, డెన్నిస్ హేస్ 141 దేశాలు పాల్గొన్న ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. 2016లో ఎర్త్ డే వాతావరణ పరిరక్షణకు అంకితం చేశారు. ప్రస్తుతం ఎర్త్ డే నెట్‌వర్క్ 190 దేశాలలో 20,000 మంది భాగస్వాములు, సంస్థలను కలిగి ఉంది.

 
వరల్డ్ ఎర్త్ డే 2024 థీమ్.. 

ప్రతి సంవత్సరం ప్రపంచ భూమి దినోత్సవాన్ని ఒక థీమ్‌తో జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో దీనిని 'ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్'  అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అంతం చేయడం, దాని ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణపై దృష్టి పెట్టడం అనే థీమ్ తో  జరుపుతున్నారు.  

ఎర్త్ డే జరుపుకోవడానికి కారణం..?  

ఎర్త్ డే రోజున, కాలుష్యం, దాని సవాళ్లు, అడవుల నిర్మూలన వంటి పర్యావరణ సమస్యల గురించి చర్చించడానికి మిలియన్ల మంది ప్రజలు కలిసి వస్తారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల సహాయంతో పర్యావరణం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ భూమిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అవగాహన కల్పించడానికి ఈ ఎర్త్ డే ని జరుపుతారు.

 ఇది కూడా చదవండి.. పార్కిన్సన్స్ నివారణకు ఏమేం చేయాలి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.