WHO Warns : కదలిక తగ్గితే.. ముప్పు పెరిగినట్టే..! ఆందోళన కలిగిస్తున్న WHO గణాంకాలు..
సాక్షి లైఫ్ : ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కుర్చీకే పరిమితం అవుతున్నారా..? ఆఫీసు పనులు, ఇంటి వద్ద విశ్రాంతి పేరుతో శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారా..? అయితే మీరు తక్షణమే అప్రమత్తం కావాల్సిందే. శరీరానికి తగినంత కదలిక లేకపోతే అనేక తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు నిశ్శబ్దంగా దాడి చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు..
2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 31 శాతం మంది పెద్దలు కనీస శారీరక శ్రమ చేయడం లేదు. చురుకుగా ఉండే వారితో పోలిస్తే, శారీరక శ్రమ లేని వారిలో అకాల మరణం సంభవించే ప్రమాదం 20 నుంచి 30 శాతం వరకు ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
నిశ్చల జీవనశైలితో పొంచి ఉన్న ప్రమాదాలు..
శారీరక శ్రమ లోపించడం వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అవేమిటో ఇక్కడ తెలుసుకుందాం..
హృద్రోగ సమస్యలు.. గంటల తరబడి కూర్చోవడం వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది. తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతుంది.టైప్-2 మధుమేహం..శారీరక శ్రమ లేకపోవడం టైప్-2 డయాబెటిస్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి. వ్యాయామం చేయడం వల్ల శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. కదలిక లేనప్పుడు మెటబాలిక్ సమస్యలు తలెత్తి చక్కెర వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కేవలం తీపి పదార్థాలు తగ్గించినంత మాత్రాన మధుమేహం రాకుండా ఆపలేము, వ్యాయామం కూడా అంతే ముఖ్యం.
ఊబకాయం ముప్పు.. తీసుకునే ఆహారానికి తగినట్లుగా క్యాలరీలు ఖర్చు కాకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు విపరీతంగా పెరుగుతారు. ఈ ఊబకాయం అధిక రక్తపోటు, ఇతర జీవక్రియల సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు (Hypertension)..శారీరక శ్రమ లోపించడం వల్ల రక్తపోటు సమస్య వేధిస్తుంది. ఇది దీర్ఘకాలంలో గుండె, రక్తనాళాలపై ఒత్తిడి పెంచుతుంది.
మానసిక సమస్యలు.. వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా అవసరం. శారీరక కదలికలు లేకపోవడం వల్ల ఒత్తిడి (stress), ఆందోళన (anxiety), డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
పరిష్కారం ఏమిటి..?
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజూ జిమ్‌కు వెళ్లి కఠినమైన వర్కవుట్లు చేయాల్సిన అవసరం లేదు. మన దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుంది. కనీస వ్యాయామం: WHO సూచనల ప్రకారం, ప్రతి వయోజనుడు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల పాటు మితమైన శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలి.
చిన్నపాటి మార్పులతో ..ఆఫీసులో లిఫ్ట్ కు బదులుగా మెట్లు ఎక్కడం, దగ్గర్లో ఉన్న పనులకు నడుచుకుంటూ వెళ్లడం, సైక్లింగ్ చేయడం వంటివి దైనందిన అలవాట్లుగా మార్చుకోవాలి. విరామం తీసుకోండి..ఆఫీసులో గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా, పని మధ్యలో లేచి కాస్త నడవాలి. కండరాలను సాగదీసే చిన్నపాటి స్ట్రెచెస్ చేయాలి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ తగదు. నేటి నుంచే చురుకైన జీవనశైలిని అలవర్చుకుని భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాలకు చెక్ పెట్టండి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
