New Rules : ఆసుపత్రి సిబ్బందికీ ఇక ‘అర్హత’ పరీక్ష..!.. ల్యాబ్, డయాలసిస్, ఎక్స్‌రే టెక్నీషియన్లకు కొత్త నిబంధనలు..!
సాక్షి లైఫ్ : ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడంలో వైద్యుల పాత్ర ఎంత ముఖ్యమో.. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే, చికిత్సలో సహాయపడే అనుబంధ వైద్య సిబ్బంది (allied healthcare workers) పాత్ర కూడా అంతే కీలకం. రక్త పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు, డయాలసిస్ చేసే సిబ్బంది, ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి యంత్రాలను నడిపే నిపుణులు ఈ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన భాగం. అయితే వీరందరి విద్యార్హతలు, శిక్షణ ప్రమాణాల విషయంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన విధానం లేదు. ఈ నేపథ్యంలో వైద్యరంగంలో నాణ్యతను పెంచేందుకు కేంద్రం కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది.
ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
‘నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్’ (NCAHP) 2026 సంవత్సరానికి గానూ కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో పనిచేసే అనుబంధ ఆరోగ్య సిబ్బందికి ఇకపై రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది. కేవలం యంత్రాలు నడపడం తెలిస్తే సరిపోదు.. వారి విద్యార్హతలు, శిక్షణ ప్రమాణాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
ఇప్పటికే పనిచేస్తున్న వారి పరిస్థితి ఏంటి..?
కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం వివిధ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో పనిచేస్తున్న పాత సిబ్బందిపైనా దీని ప్రభావం ఉండనుంది. ముందుగా పాత సిబ్బందికి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ మంజూరు చేస్తారు. ఆ తర్వాత వారి ప్రస్తుత విద్యార్హతలను బట్టి ఆరు నెలల నుంచి ఏడాది పాటు అదనపు కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. సంబంధిత అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాతే వారికి 'శాశ్వత రిజిస్ట్రేషన్' లభిస్తుంది.
ఏయే విభాగాలు ఈ పరిధిలోకి వస్తాయి అంటే..?
ఈ కొత్త నిబంధనలు డాక్టర్లకు కాకుండా.. ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ, చికిత్స, రోగుల సంరక్షణలో కీలక పాత్ర పోషించే అనుబంధ ఆరోగ్య నిపుణులకు మాత్రమే వర్తిస్తాయి. ఇందులో ప్రధానంగా..
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, రేడియాలజీ, ఇమేజింగ్ అంటే ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఫిజియోథెరపీ,కంటి పరీక్షల విభాగం అంటే ఆప్టోమెట్రీ, పోషకాహార నిపుణులు తదితర విభాగాల వారు ఈ నిబంధనల పరిధిలోకి వస్తారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే నకిలీ టెక్నీషియన్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటంతో పాటు, రోగులకు కచ్చితమైన వైద్య పరీక్షల ఫలితాలు, మెరుగైన సేవలు అందుతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
