Crackdown on Illegal Egg Trde: అక్రమ అండాల దందాపై ఉక్కుపాదం... ఆ ఐవీఎఫ్ కేంద్రాల లైసెన్సుల రద్దు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : హైదరాబాద్‌లో ఇటీవల వెలుగుచూసిన అక్రమ అండాల దందా (Egg Donation Racket) వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ అక్రమ వ్యాపారంతో సంబంధం ఉన్న ప్రైవేట్ ఐవీఎఫ్ (IVF) కేంద్రాల రిజిస్ట్రేషన్లతో పాటు, ఇందులో పాలుపంచుకున్న వైద్యుల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసే అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

ఇటీవల హైదరాబాద్ పోలీసులు కమర్షియల్ ఎగ్ డొనేషన్ ముఠా గుట్టురట్టు చేసి, 43 మంది మహిళలను రక్షించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కోఠిలోని టీజీఎంఎస్‌ఐడీసీ (TGMSIDC) కార్యాలయంలో సీనియర్ వైద్యాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐవీఎఫ్ కేంద్రాల నిర్వహణ, మందుల వాడకంపై మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాల పనితీరుపై ఆరోగ్య శాఖ నిరంతరం నిఘా ఉంచాలి. ఐవీఎఫ్ చికిత్సలో వినియోగించే మందుల తయారీ నుంచి విక్రయాల వరకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ (DCA) నిశితంగా పర్యవేక్షించాలి.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.అక్రమ అండాల దందాలో ప్రమేయం ఉన్న వ్యక్తులు, సంస్థలపై జరుగుతున్న పోలీసు దర్యాప్తులో వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ సహకారం అందించాలి.   

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.