న్యూ స్టడీ : యువతలో క్యాన్సర్ వేగంగా పెరగడానికి కారణాలు ఇవే.. 

షేర్ చేయండి:
న్యూ స్టడీ : యువతలో క్యాన్సర్ వేగంగా పెరగడానికి కారణాలు ఇవే.. 

సాక్షి లైఫ్ : క్యాన్సర్‌ మహమ్మారిని అంతమోందించేందుకు అనేక ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అందులోభాగంగా దీనికి సంబంధించి తాజా అధ్యయనాఫలితాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని తాజా పరిశోధనలో తేల్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..? యువతలోనే ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 ఇది కూడా చదవండి.. పార్కిన్సన్స్ నివారణకు ఏమేం చేయాలి..? 

తాజా పరిశోధన ప్రకారం..

తాజా పరిశోధన ప్రకారం.. నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్,ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు పురుషులలో ఎక్కువగా కనిస్తున్నాయి. అయితే రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారతదేశంలోని యువతలో క్యాన్సర్ కేసుల పెరగడానికి ప్రధాన కారణాలేంటి..? ప్రపంచవ్యాప్తంగా మరణాలకు క్యాన్సర్ కూడా ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. క్యాన్సర్ అనేది ఒక సంక్లిష్ట వ్యాధి, దీనిలో ప్రభావితమైన శరీర భాగంలోని కణాలు అనియంత్రితంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఈ వ్యాధి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా రోగికి మాత్రమే కాకుండా అతని కుటుంబానికి కూడా బాధాకరంగా ఉంటుంది. 

పెరుగుతున్న క్యాన్సర్ కేసుల వెనుక అనేక కారణాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. సరైన జీవనశైలి అలవాట్లులేకపోవడం, ప్రస్తుత ఆహారపు అలవాట్లు, పొగాకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, ఒత్తిడి మొదలైనవి క్యాన్సర్ కు ప్రధానకారణాలని వారు చెబుతున్నారు. అలాగే పర్యావరణంలో కాలుష్యం పెరగడం, జన్యువుల కారణంగా కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యనిపుణులు అంటున్నారు.

 పట్టణీకరణ.. 

పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధి కారణంగా మన జీవనశైలిలో చాలా మార్పు వచ్చాయని, దీని కారణంగా, ఎక్కువ మంది ప్రజలు నిశ్చల జీవనశైలి ,అనారోగ్యకరమైన ఆహారం వల్ల కూడా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒబేసిటీ, కెమికల్ పొల్యూషన్, బ్రెస్ట్ ఫీడ్ తీసుకోకపోవడం కారణంగా కూడా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. 

నిశ్చల జీవనశైలి.. 

 సాంకేతికత అభివృద్ధి కారణంగా, పని ప్రదేశాల వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. శారీరక శ్రమ తగ్గింది, దీని కారణంగా ప్రజలు నిశ్చల జీవనశైలిని అనుసరిస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడం రొమ్ము, పెద్దప్రేగు , ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయ సమస్య పెరగడమే కాకుండా హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక పనితీరుపై ప్రభావం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 

ఆహారంలో మార్పు.. 

ఎక్కువ రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధికంగా చక్కెర కలిగిన ఆహారాలు తమ రోజువారీ ఆహారంలో చేర్చడం. పండ్లు, కూరగాయలు తినడం తక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ కారణాలు ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాద కారకాలను పెంచుతాయి.

ధూమపానం-మద్యపానం.. 

ధూమపానం, మద్యపానం, పొగాకు అధికంగా తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతుంది. ఔషధాల అధిక వినియోగం, అధిక ఒత్తిడి, ఇతర జీవనశైలి మార్పులు కూడా క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి.

 ఇది కూడా చదవండి.. మెదడుకు ఆక్సిజన్ ఎంతసేపటి వరకూ అందకపోతే డ్యామేజ్ అవుతుంది..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.