తమిళనాడులో పీచుమిఠాయిని ఎందుకు నిషేధించారంటే..?  

షేర్ చేయండి:
తమిళనాడులో పీచుమిఠాయిని ఎందుకు నిషేధించారంటే..?  

సాక్షి లైఫ్ : తమిళనాడులో పీచుమిఠాయిని ఎందుకు నిషేధించారు..? దేనికి ప్రధాన కారణాలేంటి..? క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైన నేపథ్యంలో తమిళనాడు పీచుమిఠాయి విక్రయాలను నిషేధించింది. చెన్నైలోని బీచ్‌లు, ఇతర ప్రాంతాల నుంచి ఆహార భద్రతా విభాగం సేకరించిన నమూనాలలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షలు నిర్ధారించడంతో తమిళనాడు ఆరోగ్యశాఖమంత్రి సుబ్రమణియన్ తమిళనాడు రాష్ట్రంలో పీచు మిఠాయిల ఉత్పత్తి ,అమ్మకాలను నిషేధించారు.

పరీక్షా ఫలితాల్లో ఏమి తేలింది..?  

పీచు మిఠాయిలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించినందున, తమిళనాడులో పీచు మిఠాయి అమ్మకాలను నిషేధించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తయారీ, ప్యాకేజింగ్, దిగుమతి, ,విక్రయించడం లేదా వివాహాలు, ఇతర కార్యక్రమాలలో రోడమైన్-బి తో తయారయ్యే ఆహార పదార్థాలను ఉపయోగించడం ఆహార భద్రత ,ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం శిక్షార్హమని ఆయన తెలిపారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లఘిస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆయన ఆదేశించారు.

రోడమైన్-బి.. 

ఆహార పదార్థాల తయారీలో రోడమైన్-బిని ఉపయోగించడం ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం శిక్షార్హమని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ అన్నారు. ఇప్పటికే మరికొన్ని చోట్ల నుంచి స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్ పరీక్షకు పంపనున్నట్లు ఆయన చెప్పారు. 

రెండు వారాల క్రితం మెరీనా బీచ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో పీచు మిఠాయిలు విక్రయించే స్టాళ్లపై చెన్నైలోని ఆహార భద్రత విభాగం నిర్ణీత అధికారి పి.సతీష్‌కుమార్‌ నేతృత్వంలోని అధికారుల బృందం దాడులు చేసింది. పుదుచ్చేరిలో ఇదే విధమైన దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత, అక్కడ విక్రయించే పీచు మిఠాయిలో రోడమైన్-బి అనే రసాయనిక రంగు ఉన్నట్లు తేలింది. దీని కారణంగా క్యేన్సర్ ప్రమాదం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు ఈ రసాయనాల కారణంగా మూత్రపిండాలు, కాలేయ పనితీరుపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుందని కనుగొన్నారు. 

నమూనాల్లో.. 

పీచు మిఠాయి నమూనాల్లో రోడమైన్-బి ఉన్నట్లు నిర్ధారిస్తూ ఫిబ్రవరి 16న ఆహార భద్రతా విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు ఇలాంటి పీచు మిఠాయిలను నాసిరకమైనవిగా నిర్ధారించడమేకాకుండా ప్రాణాలకే ప్రమాదమని ప్రకటించింది.

ఇది కూడా చదవండి.. గర్భిణీలు బొప్పాయి తినకూడదా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.