Drinking RO Water : ఆర్వో వాటర్ తాగుతున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత రోజుల్లో ప్రతి వంటగదిలో ఆర్వో (RO) Reverse Osmosis ప్యూరిఫైయర్ ఉండటం సర్వసాధారణంగా మారిపోయింది. కుళాయి నీటి కంటే ఆర్వో నీరే సురక్షితమని, ఇది 100 శాతం స్వచ్ఛమైనదని చాలామంది భావిస్తుంటారు. అయితే, ఆర్వో వడపోత ప్రక్రియలో మలినాలు, బ్యాక్టీరియాతో పాటు శరీరానికి అత్యవసరమైన ఖనిజ లవణాలు కూడా తొలగిపోతాయని, దీనివల్ల దీర్ఘకాలంలో రోగనిరోధక శక్తి, ఎముకల దృఢత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

 

ఆర్వో ఎప్పుడు అవసరం..? ఎప్పుడు నష్టం..?

నీటిలో టీడీఎస్ (Total Dissolved Solids) TDS 500 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని శుద్ధి చేయడానికి ఆర్వో విధానం సరైనది. ఇది నీటిలోని ఆర్సెనిక్, ఫ్లోరైడ్, భార లోహాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. కానీ, ఇంటికి వచ్చే నీటి టీడీఎస్ 150 నుంచి 250 మధ్య ఉన్నప్పుడు ఆర్వో వాడితే.. ఆ నీరు పరిమితికి మించి శుద్ధికి గురై క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు పూర్తిగా నశిస్తాయి.

ఖనిజాలు లేని నీటిని తాగడం వల్ల కలిగే నష్టాలు..

ఎముకలు, గుండెపై ప్రభావం..గుండె పనితీరు సక్రమంగా ఉండటానికి, ఎముకలు దృఢంగా ఉండటానికి క్యాల్షియం, మెగ్నీషియం అత్యవసరం. ఖనిజాలు లేని ఆర్వో నీటిని నిరంతరం తాగడం వల్ల శరీరంలో వీటి లోపం ఏర్పడి కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం (muscle cramps), అధిక రక్తపోటు (hypertension) వంటి ముప్పు పెరుగుతుంది.

జీర్ణక్రియ, ఇమ్యూనిటీ దెబ్బతింటుంది..పొట్టలోని మంచి బ్యాక్టీరియాను, ఆమ్లాలను సమతుల్యంగా ఉంచడంలో ఖనిజాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఖనిజాలు లేని నీరు తాగినప్పుడు శరీరం ఆమ్లత్వాన్ని (acidity) తట్టుకోలేక గ్యాస్, అలసట లాంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులలో దీని ప్రభావం త్వరగా కనిపిస్తుంది. గర్భిణులు, పిల్లలకు మరింత ప్రమాదం.. పిల్లల శారీరక ఎదుగుదలకు, గర్భిణుల ఆరోగ్యానికి క్యాల్షియం, మెగ్నీషియం చాలా అవసరం. ఖనిజాలు లోపించిన ఆర్వో నీరు తాగితే వారిలో తీవ్రమైన పోషకాహార లోపం తలెత్తుతుంది.

సురక్షితమైన నీటి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఆర్వో ప్యూరిఫైయర్‌లో టీడీఎస్‌ను ఎప్పుడూ 150 నుంచి 250 మధ్య ఉండేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీఎస్ 80 కంటే కిందకు పడిపోకూడదు. మీ ఇంటికి వచ్చే కుళాయి నీటి టీడీఎస్ సహజంగానే 80 నుంచి 300 మధ్య ఉంటే.. ఆర్వో (RO)కు బదులుగా యూవీ+యూఎఫ్ (UV+UF) ప్యూరిఫైయర్‌ను ఎంచుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

శరీరానికి సహజ ఖనిజాలు అందేందుకు, రోజులో కనీసం ఒకటి లేదా రెండుసార్లు మట్టికుండలో లేదా రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. నీరు కేవలం దాహం తీర్చుకోవడానికే కాదు, శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించే ప్రధాన వనరు. కాబట్టి దాన్ని పరిమితికి మించి శుద్ధి చేసి పోషకాలు లేని నీరుగా మార్చుకోకూడదు.

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.