కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్‌ను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేశారా అని ఆరాతీసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..?
సాక్షి లైఫ్ : భారతదేశంలో దగ్గు సిరప్ వల్ల పిల్లలు మరణించిన తరువాత, ఈ మందులు ఇతర దేశాలకు ఎగుమతి చేశారా..? అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) విచారించింది. అయితే విషపూరిత దగ్గు సిరప్‌లను అమెరికాకు మాత్రం ఎగుమతి చేయలేదని యూస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) స్పష్టం చేసింది. విషపూరిత మందులు యునైటెడ్ స్టేట్స్‌లోకి రాకుండా నిరోధించడానికి అప్రమత్తంగా ఉందని ఎఫ్ డిఏ పేర్కొంది.
ఇది కూడా చదవండి.. పిల్లల్లో ఈ 5 లక్షణాలు కనిపిస్తే విటమిన్-డి లోపమే..!
ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?
ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?
అమెరికాకు కూడా ఎగుమతి చేశారా?
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో విషపూరిత దగ్గు సిరప్‌ల వల్ల పిల్లలు మరణించారు. ఈ సంఘటన తర్వాత, ఈ మందులు ఇతర దేశాలకు ఎగుమతి చేశారా..? లేదా అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారతదేశం నుంచి వివరణ కోరింది. దీని తరువాత, భారతదేశంలో పిల్లల మరణాలకు సంబంధించిన విషపూరిత దగ్గు సిరప్‌ను అమెరికాకు ఎగుమతి చేయలేదని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది.
నిజానికి, భారతదేశంలో స్థానికంగా విక్రయించే దగ్గు సిరప్‌ల పరీక్షలో "నియంత్రణ లోపాలు" ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దేశంలో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్‌ను సాధారణ విధానాలలో భాగంగా ఇతర దేశాలకు ఎగుమతి చేశారా లేదా అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం నుండి వివరణ కోరింది.
టాక్సిక్ దగ్గు సిరప్‌లు..
భారతదేశంలో పిల్లల మరణాలకు కారణమైన విషపూరిత దగ్గు సిరప్‌లను అమెరికాకు రవాణా చేయలేదని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం ధృవీకరించింది. భారతదేశంలో పిల్లల దగ్గు, జలుబు మందులలో డైథిలిన్ గ్లైకాల్ అండ్ ఇథిలీన్ గ్లైకాల్ వల్ల కలిగే విషపూరితం గురించి నివేదికల గురించి తమకు తెలుసని యుఎస్ ఎఫ్ డి ఏ పేర్కొంది.
యుఎస్ కు ఎగుమతి చేసే ముందు ఎఫ్ డి ఏహెచ్చరిక..
భారతదేశం నుండి మరే ఇతర దేశానికి ఈ ఉత్పత్తులు ఎగుమతి చేయబడటం లేదని భారతదేశ ఆరోగ్య అధికారం, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ యుఎస్ రెగ్యులేటర్‌కు తెలియజేసిందని ఎఫ్ డి ఏ పేర్కొంది. అటువంటి విషపూరిత మందులు యుఎస్ లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి తాము అప్రమత్తంగా ఉన్నామని ఎఫ్ డి ఏ కూడా పేర్కొంది.
యుఎస్ లో విక్రయించే మందులు సురక్షితంగా అత్యున్నత నాణ్యతతో ఉండేలా చూసుకోవాలని తయారీదారులను కూడా కోరింది. కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్‌లో డైఇథిలీన్ గ్లైకాల్ అండ్ ఇథిలీన్ గ్లైకాల్ అనే కెమికల్ పరిమితికి మించి ఉన్నట్లు కనుగొన్నారు. కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్, మరో రెండు బ్రాండ్‌లను నివారించాలని భారత అధికారులు ప్రజలకు సూచించారు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
