వేసవి కాలంలో మట్టి కుండలో నీళ్ళే ఎందుకు తాగాలి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎండాకాలంలో మట్టికుండలో నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. ఎందుకంటే అన్నిరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయ్ మరి. అవును ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఈ నీళ్లు తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వేసవి కాలంలోమట్టి కుండలో నీళ్ళే ఎందుకు తాగాలి..? ఆ నీటివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
ఇది కూడా చదవండి.. పోలియో అంటే ఏమిటి..లక్షణాలు, నివారణ పద్ధతులు.. 

మట్టి కుండనీరు ప్రయోజనాలు..  

మట్టి కుండ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. నిజానికి మట్టికి అనేక రకాల వ్యాధులతో పోరాడే శక్తి ఉంది.  మండే వేడి నుంచి ఉపశమనం పొందడానికి, ప్రజలు మట్టి కుండ నీటిని తాగడానికి ఇష్టపడతారు. ఐతే ఈ కుండనీరు ఎంత చల్లగా ఉంటే ఆరోగ్యానికి అంత మేలు . చాలామంది ఇళ్లలో మట్టి కుండ ఉంటుంది. ఇది నీటిని చల్లగా ఉంచడంలోనూ, అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.  

శరీరంపై ప్రభావం..

వేసవికాలంలో రిఫ్రిజిరేటర్ లోని చల్లటి నీరు తాగితే, గొంతు నొప్పి లేదా ఇతర సమస్యలు వస్తాయి. నీరు చల్లదనం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది. అయితే కుండలోని నీరు చాలా చల్లగా ఉంటుంది. కానీ అవి తాగడం వల్ల ఎలాంటి సమస్యలూ తలెత్తవు.  

ఎండదెబ్బ నుంచి రక్షణ.. 

వేసవి కాలంలో ఎండదెబ్బ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తూంటాయి. వీటిని నివారించడానికి, మట్టి కుండలోని నీరు తాగాలి. ఈ నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీరు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

జీవక్రియ.. 

ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని తాగితే విషంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే బిస్ఫినాల్ వంటి విషపూరిత రసాయనాలు శరీరానికి అనేక విధాలుగా హాని చేస్తాయి. అదే మట్టి కుండలో నీరు తాగడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిని సమతుల్యంగా ఉంటుంది. శరీరంలోని జీవక్రియ కూడా  మెరుగుపడుతుంది.

కడుపు సంబంధిత సమస్యలు..  

కుండ నీరు తాగడం ద్వారా ఎసిడిటీ, ఇతర కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

కుండలో నీటిని ఉంచేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
మీరు వేసవి కాలంలో కుండలోని నీటిని క్రమం తప్పకుండా తాగితే, ఖచ్చితంగా ప్రతిరోజూ  కుండను శుభ్రంగా కడగాలి. లేకపోతే కుండలో శిలీంధ్రాలు పెరిగి ఆరోగ్యానికి హానికలిగిస్తాయి.  

ఇది కూడా చదవండి.. న్యూ రీసెర్చ్ : కృత్రిమ మానవ యాంటీబాడీస్ తో పాము విషాన్ని తొలగించవచ్చు.. 

 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.