చెడుకొలెస్ట్రాల్ ను నియంత్రించే ఆకు..
సాక్షి లైఫ్ : తమలపాకులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని కిళ్లీ కోసమే కాదు.. పలురకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి కూడా తమలపాకులను వినియోగిస్తారు. పూర్వ కాలం నుంచే ఆయుర్వేదంలో తమలపాకులను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఆకు అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. తమలపాకులతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఓసారి తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి.. విటమిన్ "డి " ట్యాబ్లేట్స్ ఎలాంటివాళ్లు వాడాలి..?
మంచి కొలెస్ట్రాల్..
తమలపాకులను రోజూ తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తవు. తమలపాకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. కనుక ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. రోజూ రాత్రి పూట భోజనం అనంతరం రెండు తమలపాకులను నేరుగా అలాగే నమిలి మింగాలి. దీంతో మరుసటి రోజు ఉదయం వరకు షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..
షుగర్ లెవల్స్..
మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా రెండు తమలపాకులను నమలాలి. దీని వల్ల రోజు మొత్తం షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరం, విరేచనాలు వంటివి తగ్గిపోతాయి. అందుకు గాను తమలపాకులను పూటకు ఒకటి చొప్పున నమిలి తింటుండాలి. తమలపాకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. అందువల్ల తమలపాకులను రోజూ తింటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
జ్వరం..
తమలపాకులను తినడం వల్ల మలేరియా జ్వరం సైతం తగ్గిపోతుంది. నోట్లో ఉండే సూక్ష్మ జీవులు చనిపోయి నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటి సమస్యల నుంచి బయట పడవచ్చు. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. తమలపాకులను తింటే ఎలాంటి జీర్ణ సమస్య అయినా తగ్గుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఔషధ గుణాలు..
తమలపాకులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అవి మన నాడీ మండల వ్యవస్థపై పనిచేస్తాయి.దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. సంతోషంగా ఉండేలా హార్మోన్లను ప్రేరేపిస్తాయి. అలాగే శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. తమలపాకు ఒకటి తీసుకుని దంచి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని వేసి గాయాలు, పుండ్లపై రాసి కట్టు కట్టాలి. దీంతో అవి త్వరగా నయమవుతాయి.
ఇది కూడా చదవండి.. లాలాజల ఉత్పత్తి తగ్గితే ఏం జరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
