సాక్షి లైఫ్ : విటమిన్ "డి "శరీరంలో కాల్షియం, ఫాస్పరస్‌ను నియంత్రించ డంలో సహాయపడే ముఖ్యమైన విటమిన్. అంతేకాదు ఎముకలను దృఢంగా ఉంచడంలో "డి" విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ట్యాబ్లేట్స్ అందరూ వేసుకోకూడదా..? ఒకవేళ "డి" విటమిన్ వేసుకు నేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి వాళ్ళు వేసుకోకూ డదో తెలుసుకుందాం..?
ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ అయితే ఏం జరుగుతుంది..?
చేపలు, గుడ్లు ,బలవర్థకమైన పాలలో కూడా విటమిన్ "డి "లభిస్తుంది. అంతేకాదు సూర్యరశ్మి ద్వారా "డీ"విటమిన్ ను పొందొచ్చు. 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు "డి" విటమిన్ లోపానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే వీళ్లలో ఎక్కువగా ఎముకల సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. విటమిన్ D2, D3 తో సహా విటమిన్ "డి " ట్యాబ్లేట్స్ వివిధ రూపాల్లో లభిస్తాయి. కనీసం నాలెడ్జ్ లేకుండా విటమిన్ ట్యాబ్లేట్స్ వాడకూడదు.
విటమిన్స్ రెండు రకాలున్నాయి. వీటిలో నీళ్లలో కరిగే విటమిన్స్, కొవ్వులొ కరిగే విటమిన్స్ ఉన్నాయి. నీళ్లలో కరిగే బీ కాంప్లెక్స్ ట్యాబ్లేట్స్ లో B1 నుంచి బీ 12 వరకు విటమిన్ ట్యాబ్లేట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ బీ కాంప్లెక్స్ విటమిన్స్ అని అంటారు. ఇవన్నీ వాటర్ లో కరిగే విటమిన్స్.. విటమిన్ "సి' టాబ్లెట్స్ కూడా నీళ్లలో కరిగిపోతుంది. విటమిన్ "సి' టాబ్లెట్స్, బీ కాంప్లెక్స్ విటమిన్స్ కానీ ఎక్కువగా తీసుకున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
కొవ్వులొ కరిగే విటమిన్ "ఏ ", "డి ", "ఈ", "కె" , ఇవి నాలుగు విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉంది. బీ కాంప్లెక్స్ ట్యాబ్లేట్స్ వలె ఈ టాబ్లెట్స్ నీటిలొకరిగి యూరిన్ లో బయటకువెళ్ళే పరిస్థితి ఉండదు. కొవ్వులో కరిగే టాబ్లెట్స్ అలాకాదు. కొవ్వులొకరిగిన తర్వాత ఈ మాత్రలకు బయటకువెళ్ళే అవకాశం లేదు. దీనివల్ల శరీరంలో క్యాల్షియం లెవల్స్ విపరీతంగా పెరుగుతాయి.
ఇలాంటి "డీ"విటమిన్ టాబ్లెట్స్ వాడడం వల్ల కొందరి రక్తంలో 19శాతం క్యాల్షియం పెరిగి కిడ్నీలు దెబ్బతిని కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. చాలా మంది విటమిన్ "డి" వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొవ్వులొ కరిగే విటమిన్ "ఏ ", "డి ", "ఈ", "కె" , ఇవి నాలుగు విటమిన్ టాబ్లెట్స్ ఎలాపడితే అలా వాడ కూడదు.
రక్తపరీక్షల అనంతరం "డి" విటమిన్ లోపం ఉందని తేలితేనే డాక్టర్ల సలహా మేరకు వాడాలి. లేకపోతే శరీరంలో "డి " విటమిన్ లెవల్స్ ఎక్కువగా పెరిగి కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహా తీసుకోకుండా కొన్నిరకాల టాబ్లెట్స్ వాడడం వల్ల పలురకాల అనారోగ్య సమస్యల బారీన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా "డి" విటమిన్ టాబ్లెట్స్ వాడే సమయంలో ఖచ్చితంగా డాక్టర్ల అడ్వైజ్ తీసుకోవాలి.