నువ్వులలో అద్భుతమైన ఆరోగ్యప్ర‌యోజ‌నాలు

సాక్షి లైఫ్: నువ్వులు మంచి పోషకవిలువలు కలిగిన ఆహారం. ప‌చ్చ‌ళ్ల‌లో నువ్వుల పొడి, కూడా వేస్తుంటారు. అయితే నువ్వులు బాగా వేడి అని చాలా మందిఅపోహ పడతారు.పెద్ద‌ల‌కు రోజుకు 450 మిల్లీగ్రాములు, పిల్ల‌ల‌కు 600 మిల్లీగ్రాములు, గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లుల‌కు రోజుకు 900 మిల్లీగ్రాముల కాల్షియం అవ‌స‌రం. నువ్వుల్లో అనేక రకాల ఆరోగ్యప్ర‌యోజ‌నాలున్నాయి. వీటిలో పాల కంటే  13 రెట్లకుపైగా కాల్షియం ఉంటుంది. 

100 గ్రాముల నువ్వుల్లో.. 

నువ్వుల్లో ఎక్కువ మోతాదులో కాల్షియం ఉండడం వల్ల ఎముక‌లు  దృఢంగా ఉంటాయి. 100 గ్రాముల నువ్వుల్లో 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. రోజూ గుప్పెడు నువ్వులు తింటే చాలు శరీరానికి తగిన కాల్షియం ల‌భిస్తుంది. నువ్వుల‌ను వేయించి వాటిలో బెల్లం పాకం క‌లిపి ఉండ‌లుగా త‌యారు చేసుకోవాలి. వీటిని రోజుకు ఒక్క‌టి తిన్నా చాలు.. శ‌రీరానికి కావల్సిన కాల్షియం మొత్తం ల‌భిస్తుంది. అంతేకాదు ఎముక‌లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.ముఖ్యంగా నువ్వుల‌ను నేరుగా తినాల‌నుకుంటే వాటిని 7 నుంచి 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. 

అనేక పోష‌కాలు.. 

నానబెట్టిన తర్వాత అవి మెత్త‌గా అవుతాయి. ఆ త‌రువాత వాటిని బాగా న‌మిలి తినాలి. వీటిని తినక ముందు, తిన్న గంట త‌రువాత వ‌ర‌కు వేరేవి ఏమీ తీసు కోకూడదు. లేదంటే నువ్వులు స‌రిగ్గా జీర్ణం కావు. ఇలా నువ్వుల‌ను తీసుకుంటే చాలా సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. వీటితో అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. నువ్వుల‌ను ఇలా తీసుకోవడం ద్వారా మ‌న‌కు అనేక ఆరోగ్య ప్రయోజ నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌, బీపీ త‌గ్గుతాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సినంత ఫైబ‌ర్ ల‌భిస్తుంది అంతేకాదు జీర్ణ స‌మ‌స్య‌లు తలెత్తవు.
 
ఎముక‌ల దృఢత్వానికి.. 

ప్ర‌ధానంగా మ‌ల‌బ‌ద్ద‌కసమస్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గుండెకు కూడా చాలా మంచిది. ఎముక‌లు దృఢంగా మారుతాయి. వాపులు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. శ‌క్తి వ‌స్తుంది. నీర‌సం పోతుంది.కాబ‌ట్టి ఈ ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే తప్పనిసరిగా రోజుకో నువ్వుల ఉండ‌ తినండి.. ఆరోగ్యంగా ఉండండి. నువ్వుల నూనెను బేకరీలలో ఎక్కువగా వినియోగిస్తారు. ప్రొటీన్, విటమిన్ బి1, డైటరీ ఫైబర్, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, కాపర్ మరియు జింక్ అన్నీ నువ్వులలో పుష్కలంగా ఉన్నాయి.

నువ్వులు పోషక విలువలు:

నువ్వులు                            100 గ్రా
ఫ్యాట్                                  50 గ్రా
శాచురేటెడ్ ఫ్యాట్                 7 గ్రా
కాపర్                              2.29 మి.గ్రా
మొత్తం కార్బోహైడ్రేట్      23 గ్రా
డైటరీ ఫైబర్                      12 గ్రా
కాల్షియం                    1450 మి.గ్రా
ప్రొటీన్                             18 గ్రా
సోడియం                      11 మి.గ్రా
పొటాషియం                 468 మి.గ్రా
ఐరన్                             9.3 మి.గ్రా
జింక్                            12.20 మి.గ్రా
మెగ్నీషియం                87శాతం 
విటమిన్ B6                   40శాతం 

ఇది కూడా చదవండి.. పచ్చి బఠానీతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : sesame-seeds

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com