పగిలిన పెదవుల సంరక్షణ కోసం ఇంటి చిట్కాలు..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సీజన్‌తో సంబంధం లేకుండా కొంతమంది పెదవులు ఎప్పుడూ పొడిబారడమేకాకుండా, పగిలిపోతూ ఉంటాయి. చల్లని గాలి, వేడి గాలి ఎండ కారణంగా కూడా పెదవులు పగిలిపోవడానికి కారణం కావచ్చు. మరికొందరిలో నిత్యం లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల కూడా పెదవులు పగిలిపోతాయి. పెదవులు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి వాటికి అదనపు జాగ్రత్త అవసరం. సీజన్ ఏదయినా పెదవులు, ముఖాన్ని తేమగా ఉండేలా చూసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. అందుకోసం లిప్ మాస్క్ వేసుకోవాలి..? అదెలా తయారు చేయాలో..? ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

 ఇది కూడా చదవండి.. సరిగ్గా బ్రష్ చేయడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. 


లిప్ మాస్క్.. కోసం ఏమేం కావాలంటే..?  
 
1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ అలోవెరా జెల్, 1 టీస్పూన్ కొబ్బరి నూనె, పచ్చి పసుపు ముక్క సగం. 

మాస్క్ ఎలా తయారు చేయాలి..?  

- లిప్ మాస్క్ చేయడానికి, ముందుగా పచ్చి పసుపును తురుమి గ్యాస్‌పై తక్కువ మంటపై ఉడికించండి.  

తర్వాత కొబ్బరినూనెను వేడి చేసి ఒక గిన్నెలోకి తీసుకుని అందులో తురిమిన పసుపు వేయాలి. తర్వాత దానికి తేనె, అలోవెరా జెల్ కలపాలి.
అలా కలిపిన ఈ  మిశ్రమాన్ని లిప్ మాస్క్‌ వేసుకోవడానికి ఓ గాజు సీసాలో పోసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.

మాస్క్ ఎలా వేసుకోవాలి..? 

లిప్ మాస్క్ వేసుకునే ముందు పెదాలను స్క్రబ్ చేయాలి. దాని కోసం ఒక గిన్నెలో చక్కెర, నిమ్మరసం వేసి దానితో స్క్రబ్ చేయాలి.

- సుమారు 1 నిమిషం పాటు రుద్ధి.. ఆ తరువాత కడగాలి. పెదవులు బాగా పగిలిపోయినట్లు ఉంటే సున్నితంగా స్క్రబ్ చేయాలి.

తర్వాత ఈ లిప్ మాస్క్‌ని అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి.

- దీని తర్వాత, గోరువెచ్చని నీటిలో శుభ్రమైన గుడ్డను ముంచి పెదాలను తుడవండి.

- ఈ మాస్క్‌ని ప్రతిరోజూ ప్రయత్నించడం ద్వారా మీ పెదవుల సమస్య పరిష్కారమవుతుంది. 

ఇది కూడా చదవండి.. ఈ వైరస్‌లు.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.