లెమన్‌గ్రాస్ హెర్బల్ టీ తయారు చేసే విధానం..
సాక్షి లైఫ్ : లెమన్ గ్రాస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి లెమన్ గ్రాస్ హెర్బల్ టీ చాలాబాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రతిరోజూ ఉదయం ఈ హెర్బల్ టీ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ దీని పాత్ర కీలకం. లెమన్ గ్రాస్ హెర్బల్ టీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి.. శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..?
లెమన్ గ్రాస్ హెర్బల్ టీ చేయడానికి కావలసిన పదార్థాలు
నిమ్మ గడ్డి - ఒక కప్పు
ఏలకులు - రెండు
అల్లం - చిన్న ముక్క
లవంగాలు - 2
తులసి - 2-4 ఆకులు
తేనె - ఒక చెంచా
నిమ్మరసం - ఒక టీస్పూన్
లెమన్ గ్రాస్ హెర్బల్ టీని ఎలా తయారు చేయాలి..?
లెమన్ గ్రాస్ టీ చేయడానికి, ముందుగా పాన్‌లో నీటిని వేడి చేయండి.
దీని తరువాత అన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు వేసి కలపాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని నీటి రంగు మారే వరకు ఉడికించాలి.
దీని తరువాత, నీరు లేత బంగారు రంగులోకి మారినప్పుడు, మంట ఆపివేయండి. లెమన్ గ్రాస్ హెర్బల్ టీ రెడీ.. దీన్ని ఒక కప్పులో వడకట్టి నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.
ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
