ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..   

సాక్షి లైఫ్ : కడుపులో ఇరిటేషన్ (ఉద్రేకం) ఎక్కువగా ఉండటమే  ఎక్కిళ్లకు కారణం. తీసుకున్న ఆహార పదార్థాలలో ఎక్కువ గా మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్, నూనె పదార్థాలు మితిమీరి తినడం వల్ల ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. 

ఇవి కూడా ఎక్కిళ్లు రావడానికి కారణాలే..  

కార్బోనేటేడ్ పానీయాలు తాగడం
అతిగా మద్యం సేవించడం
అతిగా తినడం
మానసిక ఒత్తిడి
ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు
చూయింగ్ గమ్ నమలడం
ధూమపానం చేయడం
గాలిని మింగడం
ఆహారం వేగంగా తినడం

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

‘బిరియానీ ఆకు' పేరుతో మషాలాదినుసులు అమ్మే కిరాణాషాపుల్లో దొరుకుతుంది. ఆయుర్వేదంలో దీన్ని ఆకుపత్రి అంటారు. ఈ ఆకుని మెత్తగా దంచిన పొడిని 1/2 చెంచా నుంచి 1 చెంచా మోతాదులో చిక్కని కషాయం కాచుకొని తాగండి. ఎక్కిళ్లు ఆగుతాయి.

ఉలవలసు పైపైన దంచి 1 చెంచాపొడిని చిక్కటి కషాయం కాచి తాగితే ఎక్కిళ్లు ఆగుతాయి.

-ఆగాకరకాయలు వీటినే బోడ కాకరకాయ అని కూడా అంటారు. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు చింతపండు, మసాలాకారాలు లేకుండా ఆగాకరకాయల కూర చేసుకుని తింటే ఎక్కిళ్లు తగ్గుతాయి.

ఏలకులు బుగ్గన పెట్టుకొని నమిలితే ఎక్కిళ్లు తగ్గుతాయి.

కొబ్బరిని బాగా మిక్సిపట్టి లేదా మెత్తగా రుబ్బి పిండితే వచ్చే రసాన్ని కొబ్బరి పాలు అంటారు. అందులో పంచదార కలుపుకొని తాగితే ఎక్కిళ్లు ఆగుతాయి.

-జీలకర్రపొడిని 1/2 చెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగండి. ఎక్కిళ్లు తగ్గుతాయి.

-జామపండుని కోసి వాముపొడి ఉప్పు తగినంత కలిపిన మిశ్రమాన్ని చల్లుకొని తినండి. ఎక్కిళ్లు ఆగుతాయి.

- ధనియాలను దంచి తీసిన రసంలో పటికబెల్లం కలిపి తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-tensions stress pregnancy-time home-remedies junk-food hiccups spicy-food oily-food carbonated-beverages

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com