Unauthorized Medicines : అనుమతి లేని మందులతో కిడ్నీ డిసీజెస్..ఉస్మానియా ఆసుపత్రి పరిశోధనలో షాకింగ్ నిజాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రకృతి ప్రసాదించిన మందులు.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటూ నమ్మి వినియోగించే నాటు మందులు, భస్మాలు చివరకు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. మోకాళ్ల నొప్పులనో, సంతాన సమస్యలనో ఆశ్రయించే నకిలీ వైద్యుల దగ్గర తీసుకునే పొడులు, ద్రవాలు కిడ్నీలను నిశ్శబ్దంగా కబళిస్తున్నాయి. తాజాగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) నిర్వహించిన పరిశోధనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

40 శాతం కేసుల్లో అదే కారణం..

కారణం తెలియకుండానే కిడ్నీ వ్యాధుల (CKD) బారిన పడుతున్న రోగులపై ఉస్మానియా నెఫ్రాలజీ విభాగం ప్రత్యేక అధ్యయనం చేసింది. 2021 మార్చి నుంచి 2022 నవంబర్ మధ్య చికిత్స పొందిన 75 మంది రోగులను పరిశీలించగా, అందులో దాదాపు 40 శాతం మంది రిజిస్ట్రేషన్ లేని ప్రత్యామ్నాయ మందులను వాడినట్లు తేలింది. వీరికి మధుమేహం (Diabetes) కానీ, తీవ్రమైన రక్తపోటు (BP) కానీ లేకపోయినా కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడం వైద్యులను విస్మయానికి గురిచేసింది.

లోపల ఏం జరుగుతోంది..?

మన శరీరంలోని మలినాలను వడపోసే కిడ్నీల్లో 'నెఫ్రాన్లు' అనే సూక్ష్మ వడపోత కేంద్రాలు ఉంటాయి. లైసెన్స్ లేని మందుల్లో కలిపే సీసం (Lead), ఆర్సెనిక్, మెర్క్యూరీ వంటి భార లోహాలు (Heavy Metals) నేరుగా ఈ నెఫ్రాన్లపై దాడి చేస్తాయి. ఈ లోహాలు కిడ్నీ కణజాలాన్ని లోపలి నుంచి కాల్చేస్తాయి. దీన్నే వైద్య పరిభాషలో 'టాక్సిక్ ట్యూబ్యులర్ నెక్రోసిస్' అంటారు.

కిడ్నీ 90 శాతం దెబ్బతినే వరకు ఎలాంటి నొప్పి ఉండదు. కాళ్ల వాపులు, తీవ్ర అలసట, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపించేసరికి పరిస్థితి చేయి దాటిపోతుంది.

బయాప్సీలో తేలిన నిజాలు.. 

ఈ అధ్యయనంలో భాగంగా 35 మంది రోగులకు కిడ్నీ బయాప్సీ నిర్వహించగా, అందరిలోనూ కిడ్నీ లోపలి భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు (Chronic Tubulointerstitial Nephritis) తేలింది. సగానికి పైగా రోగుల్లో కిడ్నీ కణజాలం పూర్తిగా గట్టిపడిపోయి (Glomerulosclerosis), తిరిగి కోలుకోలేని స్థితికి చేరుకుందని డాక్టర్ మనీషా సహాయ్ నేతృత్వంలోని బృందం వెల్లడించింది.

వైద్యుల హెచ్చరిక.. 

"నైపుణ్యం లేని వ్యక్తులు, అర్హత లేని సిద్ధాంతులు ఇచ్చే పొడులు, భస్మాల జోలికి వెళ్లొద్దు. పక్కింటి వారు చెప్పారనో, ఎవరో వాడారనో తెలియని మందులు వేసుకోవడం అంటే మృత్యువును ఆహ్వానించడమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లను మాత్రమే సంప్రదించాలి" అని ఉస్మానియా వైద్యులు స్పష్టం చేస్తున్నారు.  

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.