Don’t Risk Your Life for Beauty : అందం కోసం వెయిట్ లాస్ మెడిసిన్స్ తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..!  

షేర్ చేయండి:
Don’t Risk Your Life for Beauty : అందం కోసం వెయిట్ లాస్ మెడిసిన్స్ తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..!  

సాక్షి లైఫ్ : ఈ మధ్యకాలంలో నాజూగ్గా కనిపించాలనే కోరిక, సామాజిక మాధ్యమాల (Social Media) ప్రభావం వెరసి యువతను ప్రమాదకర మైన దారిలోకి నెడుతున్నాయి. మధుమేహం, ఊబకాయం చికిత్సకు వాడే మందులను వైద్యుల సలహా లేకుండా, కేవలం సౌందర్యం కోసమే వాడుతున్న వారి సంఖ్య హైదరాబాద్‌లో గణనీయంగా పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

 

కండరాల క్షీణత..

సాధారణంగా ఒజెంపిక్ (Ozempic), వెగోవీ (Wegovy), మౌంజారో (Mounjaro) వంటి మందులను తీవ్రమైన మధుమేహం లేదా ఊబకాయం ఉన్నవారికి మాత్రమే సూచిస్తారు. కానీ, ప్రస్తుతం చాలామంది వీటిని కేవలం పెళ్లిళ్లు, పార్టీలు లేదా వేడుకలకు సన్నగా కనిపించాలనే ఉద్దేశంతో 'కాస్మెటిక్ వెయిట్ లాస్' కోసం వినియోగిస్తున్నారు. జిమ్ శిక్షకులు, బ్యూటీషియన్లు లేదా స్నేహితుల సలహాతో వైద్యుడి పర్యవేక్షణ లేకుండా ఇంజెక్షన్లు తీసుకోవడం పెరిగింది. గ్యాస్ట్రిక్ సమస్యలు, డయేరియా, వాంతులు, కండరాల క్షీణత (Muscle Loss) వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

డాక్టర్ల హెచ్చరిక.. 

ఇటీవల మాదాపూర్‌కు చెందిన 24 ఏళ్ల యువతి, తన బరువు తక్కువగా ఉన్నప్పటికీ కేవలం అందం కోసం ఈ మందులు వాడి తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి మందులు వాడితే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చని ఎండోక్రినాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

వైద్యుల పర్యవేక్షణ లేకుండా బరువు తగ్గించే మందులను వాడటం వల్ల కలిగే పరిణామాలను గమనిస్తే, సరైన నిపుణుల పర్యవేక్షణలో ఈ చికిత్స తీసుకున్నప్పుడు శరీర బరువులో 5% నుండి 15% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, సొంత నిర్ణయాలతో వీటిని వాడితే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలతో పాటు, కడుపులోని ఆహారం లేదా ద్రవాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే 'ఆస్పిరేషన్' (Aspiration) వంటి ప్రాణాపాయ స్థితి తలెత్తవచ్చు. వీటితో పాటు నిరంతరంగా వికారం, కడుపులో అసౌకర్యం మరియు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కలిగే పోషకాహార లోపం వంటి దుష్ప్రభావాలు శరీరాన్ని బలహీనపరుస్తాయి.

 జాగ్రత్త అవసరం..!

త్వరలో ఈ మందులకు సంబంధించి చవకైన 'జెనరిక్' వర్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నెలకి రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ఉన్న ఖర్చు, భవిష్యత్తులో రూ.5,000 కంటే తగ్గవచ్చు. దీనివల్ల సామాన్యులకు చికిత్స అందుబాటులోకి వచ్చినా, దుర్వినియోగం పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. బరువు తగ్గడం అనేది క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, సరైన పోషకాహారం మీద ఆధారపడి ఉండాలి. మందులను కేవలం నిపుణులైన డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడాలి.

పొంచి ఉన్న ముప్పు.. 

వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ మందులు వాడటం వల్ల కలిగే నష్టాలు. వికారం, వాంతులు, కడుపులో అసౌకర్యం, డయేరియా వంటివి సాధారణం. సరైన పోషకాహారం, వ్యాయామం లేకుండా ఈ మందులు వాడితే కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోతాయి. ఈ మందులు తీసుకునే వారికి ఆహారం త్వరగా అరగదు. శస్త్రచికిత్స సమయంలో ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్లే (Aspiration) ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.