Medical Revolution : సికిల్ సెల్ వ్యాధికి సరికొత్త చికిత్స..!

సాక్షి లైఫ్ : కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి CRISPR (Clustered Regularly Interspaced Short Palindromic Repeats) క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్‌స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ ఆధారిత జన్యు చికిత్స (Gene Therapy) ను ఆవిష్కరించి, భారతదేశ వైద్య చరిత్రలో సరికొత్త మైలురాయిని నెలకొల్పారు. గిరిజన జనాభాను ఎక్కువగా పీడించే సికిల్ సెల్ వ్యాధికి (Sickle Cell Disease) చికిత్స అందించే లక్ష్యంతో ఈ విప్లవాత్మక చికిత్సను రూపొందించారు. ఈ చికిత్సకు గొప్ప గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా గౌరవార్థం 'బిర్సా 101' అని నామకరణం చేశారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

అత్యంత ఖరీదైన చికిత్సకు చౌకైన పరిష్కారం.. 

 డా. జితేంద్ర సింగ్ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జన్యు చికిత్సలకు సుమారు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఇది సామాన్యులకు అందని ధర అని అన్నారు. అయితే, CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ దేశీయ చికిత్స, ప్రపంచ ధరలో అతి తక్కువ ఖర్చుకే లభ్యం అయ్యేలా మార్గం సుగమం చేస్తుందని వెల్లడించారు.


జన్యు శస్త్రచికిత్స.. 

 CRISPR టెక్నాలజీ అనేది ఒక 'ఖచ్చితమైన జన్యు శస్త్రచికిత్స' లాంటిదని, ఇది సికిల్ సెల్ వ్యాధిని దాని మూలంలోనే సరిచేయగలదని మంత్రి వివరించారు. ఈ వ్యాధికి కారణమయ్యే లోపభూయిష్ట జన్యువును తొలగించి, ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి వీలు కల్పిస్తుంది.

సీరం ఇన్స్టిట్యూట్‌తో ఒప్పందం.. 

ఈ చికిత్సను భారీ స్థాయిలో, అందుబాటు ధరలో ప్రజలకు అందించేందు కు CSIR-IGIB సంస్థ, పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తో అధికారికంగా సాంకేతిక బదిలీ, సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

2047 నాటికి సికిల్ సెల్ రహిత భారత్ లక్ష్యం.. 

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమైన 2047 నాటికి సికిల్ సెల్ రహిత భారత్‌ను సాధించే దిశగా ఈ దేశీయ ఆవిష్కరణ ఒక కీలక ముందడుగు అని డా. జితేంద్ర సింగ్ ఉద్ఘాటించారు. ముఖ్యంగా దేశంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతాల గిరిజన వర్గాలకు ఇది గొప్ప వరం కానుంది.

ఈ చరిత్రాత్మక పరిణామం ద్వారా, భారతదేశం అధునాతన వైద్య చికిత్సల రంగంలో ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలబడటంతో పాటు, పేద, అణగారిన వర్గాల ప్రజలకు కూడా అత్యంత ఆధునిక వైద్య సేవలను అందించడానికి సిద్ధమవుతోంది.

CRISPR-Gene Therapy అంటే ఏమిటి..?

CRISPR (Clustered Regularly Interspaced Short Palindromic Repeats) అనేది జన్యువులను సవరించే ఒక విప్లవాత్మక సాంకేతికత. దీనిని ఉపయోగించి శాస్త్రవేత్తలు DNA లోని నిర్దిష్ట భాగాలను కచ్చితత్వంతో కత్తిరించి, తొలగించి లేదా మార్చగలరు. సికిల్ సెల్ వ్యాధికి కారణమయ్యే లోపాన్ని ఈ పద్ధతి ద్వారా పరిష్కరించవచ్చు. 

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-news-updates treatment genetic-issues sickle-cell sickle-cell-disease new-treatment india-health-news gene-therapy blood-type-matching sickle-cell-disease-treatment latest-medical-breakthroughs crispr-therapy-sickle-cell blood-disorder-treatments
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com