World Sight Day -2026 : స్క్రీన్‌కు కళ్లప్పగిస్తున్నారా..? జాగ్రత్త.. చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ :డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఆఫీస్ విధులు, చదువు, వినోదం ఇలా ప్రతిదానికీ స్క్రీన్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే, గంటల తరబడి రెప్పవాల్చకుండా డిజిటల్ పరికరాలను చూడటం వల్ల కంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు ప్రపంచ దృష్టి దినోత్సవం (World Sight Day)సందర్భంగా డిజిటల్ స్క్రీన్లు కళ్లపై చూపే ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

కళ్లపై తీవ్ర ప్రభావం.. 'కంప్యూటర్ విజన్ సిండ్రోమ్'..

నిరంతరం మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్లనే చూడటం వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కింది సమస్యలు తలెత్తుతాయి: కళ్లలో పొడిబారడం (Dry Eyes)..సాధారణంగా మనిషి నిమిషానికి 15-20 సార్లు కనురెప్పలు వేస్తాడు. స్క్రీన్ చూసే సమయంలో ఈ సంఖ్య 5-7 సార్లకు పడిపోతుంది. దీంతో కంటిపై ఉండే తేమ తగ్గి మంట, దురద, ఎరుపుదనం వస్తాయి. మసకబారడం, తలనొప్పి.. నిరంతరం ఒకే దూరంలో స్క్రీన్‌పై దృష్టి నిలపడం వల్ల కంటి కండరాలు అలసిపోయి చూపు మసకబారడం, నుదుటి భాగంలో తీవ్రమైన తలనొప్పి వస్తాయి.

నీరు కారడం, అలసట..స్క్రీన్ నుంచి వెలువడే వెలుతురు వల్ల కళ్లలోంచి నీరు కారడం, కళ్లు గుంజినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే వైద్య పరిభాషలో 'డిజిటల్ ఐ స్ట్రెయిన్' లేదా 'కంప్యూటర్ విజన్ సిండ్రోమ్' అంటారు. ఉద్యోగ, వ్యక్తిగత అవసరాల రీత్యా డిజిటల్ స్క్రీన్లను పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాకపోయినా, కొన్ని సులువైన జీవనశైలి మార్పులతో కంటి చూపును సమర్థంగా కాపాడుకోవచ్చు. 

‘20-20-20’ సూత్రం..

స్క్రీన్ చూసేటప్పుడు ప్రతి 20 నిమిషాలకోసారి పని ఆపి, కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూసే ‘20-20-20’ సూత్రాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా కంటి కండరాలకు తగిన విశ్రాంతి లభిస్తుంది. అలాగే మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌ను ముఖానికి బాగా దగ్గరగా ఉంచకుండా, కనీసం 18 నుంచి 24 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా స్క్రీన్ చూస్తున్నప్పుడు కనురెప్పలు వేయడం తగ్గిపోతుంది కాబట్టి, కళ్లు పొడిబారకుండా ఉండటానికి కావాలనే తరచూ రెప్పలు వేస్తుండాలి. గదిలోని వెలుతురుకు అనుగుణంగా డివైజ్ బ్రైట్‌నెస్‌ను సర్దుబాటు చేసుకోవడంతో పాటు, రాత్రివేళ లైట్లు ఆర్పేసి చీకటిలో ఫోన్ చూడటం పూర్తిగా మానేయాలి; లేదంటే ఆ నీలి వెలుతురు నేరుగా రెటీనాపై పడి దృష్టి లోపాలకు దారితీస్తుంది.

దృష్టి లోపం శాశ్వతమా..?

ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల వచ్చే అలసట, తలనొప్పి తాత్కాలికమే అయినప్పటికీ.. దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే దృష్టి సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. తరచూ చూపు మసకబారడం, కళ్లలో తీవ్ర నొప్పి, నీరు కారడం వంటి లక్షణాలు తగ్గకపోతే వెంటనే నేత్ర వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మేలు.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.