Chronic diseases : యువతను వెంటాడుతున్న దీర్ఘకాలిక వ్యాధులకు కారణం ఇదే..!

సాక్షి లైఫ్ : తెలంగాణలో దీర్ఘకాలిక రుగ్మతలు Non-communicable diseases (NCDs) ఇప్పుడు వృద్ధుల్లోనే కాదు, యువతలోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పుల కారణంగా ఈ నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాకు చెందిన పోషకాహార నిపుణులు డా. జీషాన్‌ అలీ ఈ విషయమై ప్రత్యేకంగా హెచ్చరించారు.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

హైదరాబాద్‌లో నిర్వహించిన తాజా సర్వేలో నివ్వెరపరిచే ఫలితాలు బయటపడ్డాయి.వృద్ధుల్లో ముఖ్యంగా 60 ఏళ్లు దాటినవారిలో దాదాపు సగం మంది రక్తపోటుతో బాధపడుతుండగా, నలుగురిలో ఒకరికి డయాబెటిస్ ఉన్నట్లు తేలింది. సుమారు 44శాతం మంది ఊబకాయం సమస్యతో సతమతమవుతున్నారు.

యువతలోనూ..గతంలో 50 నుంచి 60 ఏళ్ల తర్వాత కనిపించే డయాబెటిస్, హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్లకే నిర్ధారణ అవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఈ రుగ్మతలతో 30 నుంచి 40 ఏళ్లు జీవించడం భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాదీల ఆహారపు అలవాట్లే ప్రధాన సమస్య..!

హైదరాబాద్ ప్రజల ఆహారపు అలవాట్లలో అధిక కొవ్వు, తక్కువ ఫైబర్‌ ఉండటం, దీనికి తోడు పెరుగుతున్న కూర్చునే జీవనశైలి (Sedentary Lifestyle) యువతలో దీర్ఘకాలిక రుగ్మతలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలుగా డా. జీషాన్‌ అలీ పేర్కొన్నారు. అమెరికాలోని ఫిజిషియన్స్ కమిటీ ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్ (PCRM) కు చెందిన డా. అలీ, ఇటీవల ఎం. ఎన్‌. ఆర్‌. మెడికల్‌ కాలేజీలో విద్యార్థులకు తో మాట్లాడారు.


ప్లాంట్‌-బేస్డ్‌ ఫుడ్.. సంపూర్ణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లపై ఆధారపడిన శాకాహారం తీసుకోవడం. జీవనశైలి మార్పుల ద్వారా మెటాబాలిక్ రిస్క్‌లను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

శాకాహారం గుండె జబ్బులకు ఔషధం..!

ఈ సందర్భంగా డాక్టర్ అలీ ఒక ముఖ్యమైన అధ్యయన వివరాలను వెల్లడించారు. 48 మంది గుండె రోగులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో.. తక్కువ కొవ్వు ఉన్న శాకాహారాన్ని పాటిస్తూ, తేలికపాటి కార్డియో వ్యాయామం చేసిన వారిలో రక్తనాళాల సమస్య (Artery Blockage) స్పష్టంగా తగ్గింది. మొదటి ఏడాదిలో 1.75శాతం మెరుగుదల కనిపించగా, ఐదేళ్లకు ఇది "3.1శాతానికి పెరిగింది. అయితే, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయకుండా సాధారణ వైద్య చికిత్స మాత్రమే తీసుకున్న రోగుల్లో కొంత కాలం తర్వాత వ్యాధి మరింతగా పెరిగినట్టు అధ్యయనం తేల్చింది.

వైద్య విద్యలో పోషకాహార శిక్షణ తప్పనిసరి..!

 పెరుగుతున్న ఎన్సీడీల భారాన్ని తగ్గించాలంటే, వైద్య విద్యలోనే పోషకాహార శిక్షణను తప్పనిసరిగా భాగం చేయాలని డా. అలీ సూచించారు. దీర్ఘకాలిక వ్యాధి రోగులు మొదటగా సాధారణ వైద్యులనే కలుస్తారు కాబట్టి, వారికి శాస్త్రీయంగా నిరూపితమైన పోషకాహారంపై కనీస అవగాహన ఉంటే, రోగులకు సురక్షితమైన ఆహార సూచనలు ఇవ్వగలరు. ఈ సూచనలు వారి ఆరోగ్యంలో నిజమైన మార్పు తీసుకొస్తాయని ఆయన పేర్కొన్నారు.

తరతరాలుగా పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల భారంతో తెలంగాణ సతమతమవుతున్న వేళ, దీనిని అరికట్టే అత్యంత శక్తివంతమైన పరిష్కారం కేవలం ఒకటేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం తినే ఆహారాన్ని మెరుగుపరచడం. క్లినికల్ ప్రాక్టీస్‌లో ముందస్తు నిరోధక పోషకాహారాన్ని ఎంత బలంగా అమలు చేస్తామన్నదే భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని నిర్ణయించగలదని డాక్టర్ అలీ సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : non-veg nutritionists plant-based-diet youth plant-based-food malnutrition nutrition nutrition-food hyderabad nutrition-research non-veg-food
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com