World Thyroid day-2026 : మహిళల్లో సంతానలేమికి థైరాయిడ్ లోపాలే ప్రధాన కారణం: నిపుణుల హెచ్చరిక..
సాక్షి లైఫ్ : మహిళల్లో సంతానలేమి (Fertility) సమస్యలకు థైరాయిడ్ లోపాలు ప్రధాన కారణంగా మారుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు 'ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం' సందర్భంగా ప్రముఖ గైనకాలజిస్టులు, థైరాయిడ్ నిపుణులు ఈ అంశంపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గర్భధారణ కోసం ప్రయత్నించే మహిళలు ముందస్తుగానే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
సంతానోత్పత్తిపై థైరాయిడ్ ప్రభావం ఎంత..?
మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడానికి థైరాయిడ్ వ్యాధి అత్యంత సాధారణ ఎండోక్రైన్ రుగ్మతగా మారుతోంది. సరైన సమయంలో దీనికి చికిత్స తీసుకోకపోతే పలు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. థైరాయిడ్ సమస్యల వల్ల అండాల ఉత్పత్తి (Ovulation) దెబ్బతిని గర్భం దాల్చడం కష్టమవుతుంది. ఒకవేళ గర్భం దాల్చినా గర్భస్రావం (Miscarriage) అయ్యే ప్రమాదం ఉంది. ఐవీఎఫ్ చికిత్స తీసుకునే వారిలో పిండం సరిగ్గా అంటుకోకపోవడానికి (Implantation failure) ఇది దారితీయవచ్చు.
ప్రసవ సమయంలో తల్లికి థైరాయిడ్ లోపాలు ఉంటే, పుట్టే పిల్లల్లో శారీరక ఎదుగుదల లోపాలు, వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.మహిళల్లో ముఖ్యంగా రెండు రకాల థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
హైపోథైరాయిడిజం (Hypothyroidism)..
థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవ్వడం. దీనివల్ల జీవక్రియలు మందగించడం, బరువు పెరగడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వంటివి జరుగుతాయి. భారతదేశంలో 'హాషిమోటోస్ థైరాయిడిటిస్' అనే ఆటో ఇమ్యూన్ సమస్యే దీనికి ప్రధాన కారణం.
హైపర్‌థైరాయిడిజం (Hyperthyroidism)..
థైరాయిడ్ హార్మోన్లు విపరీతంగా పెరగడం. దీనివల్ల బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో 'గ్రేవ్స్ డిసీజ్' ముఖ్యమైంది.
థైరాయిడ్ నియంత్రణకు వైద్యుల సలహాలు..
గర్భధారణకు ప్రణాళిక వేసుకునే మహిళల్లో TSH స్థాయిలు సాధార ణంగా 2 నుంచి 3 మధ్యలో ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి పలు జాగ్రత్తలు తప్పనిసరి.. అటువంటివాటిలో పోషకాహారం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసమే ఆహారంలో అయోడిన్, సెలీనియం, ఐరన్, విటమిన్ డి, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి, కఠినమైన డైటింగ్ చేయకూడదు .. జీవనశైలి మార్పులు చేసుకోవాలి. జంక్ ఫుడ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. వారానికి కనీసం 150 నిమిషాల పాటు సాధారణ వ్యాయామాలు చేయాలి. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, పదే పదే గర్భస్రావం కావడం లేదా పీసీఓఎస్ (PCOS) సమస్యలు ఉన్న మహిళలు వెంటనే పూర్తి స్థాయి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు (TSH, Free T3, Free T4, TPO యాంటీబాడీస్) చేయించుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముందస్తు గుర్తింపు, సరైన చికిత్సతో సహజంగానే గర్భం దాల్చే అవకాశాలు మెరుగవుతాయని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
