NEET-2026 : నీట్-2026పై అనుమానాలు.. లీక్ అయిందా..? లేక లీక్ చేశారా..?

షేర్ చేయండి:
NEET-2026 : నీట్-2026పై అనుమానాలు.. లీక్ అయిందా..? లేక లీక్ చేశారా..?

సాక్షి లైఫ్ : వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (NEET) యూజీ-2026 పరీక్షపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. పరీక్షకు ముందు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన 'గెస్ పేపర్'లోని ప్రశ్నలు, అసలు ప్రశ్నపత్రంతో భారీగా సరిపోలడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సుమారు 125 ప్రశ్నలు అచ్చుగుద్దినట్లు దిగిపోవడంతో అభ్యర్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) లోతైన దర్యాప్తు చేపట్టింది.

 

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

  'గెస్ పేపర్' కలకలం.. 

రాజస్థాన్‌లోని సికార్ వేదికగా ఈ కుంభకోణం మూలాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. పరీక్షకు ఒక రోజు ముందే అంటే..? మే 2వ తేదీ రాత్రి కొంతమంది విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో ఒక ప్రశ్నపత్రం వైరల్ అయ్యింది. ఆ పేపర్‌లోని 125 ప్రశ్నలు మరుసటి రోజు జరిగిన పరీక్షలో రావడం యాదృచ్ఛికం కాదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక ఫోటోకాపీ దుకాణం నుంచి ఈ పేపర్ లీకైనట్లు సమాచారం అందడంతో ఎస్‌ఓజీ బృందాలు సికార్‌లోని పలు హాస్టళ్లలో సోదాలు నిర్వహించి, డజనుకు పైగా అనుమానితులను విచారిస్తున్నాయి.

ఎన్‌టీఏ (NTA) స్పందన.. దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు.. 

నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తొలుత ఈ ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ, పరిస్థితి తీవ్రతను గమనించి స్పందించింది. మే 3వ తేదీన అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష నిర్వహించామని స్పష్టం చేసింది. మే 7న అందిన కొన్ని ఫిర్యాదుల ఆధారంగా, మే 8న ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించినట్లు ప్రకటించింది. రాజస్థాన్ ఎస్‌ఓజీకి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు వెల్లడించింది.

భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు.. 

పరీక్షా పత్రాల తరలింపునకు జీపీఎస్ వాహనాలు, పరీక్షా కేంద్రాల్లో 5జీ జామర్లు, ఏఐ ఆధారిత సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి అత్యాధునిక భద్రతా ప్రమాణాలు పాటించామని ఎన్‌టీఏ చెబుతోంది. ప్రతి ప్రశ్నపత్రంపై ప్రత్యేకమైన వాటర్‌మార్క్‌లు కూడా ఉన్నాయని పేర్కొంది. ఇంతటి పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ప్రశ్నలు ముందే బయటకు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.

పోలీసుల తీరుపై విమర్శలు.. 

పరీక్ష రోజే కొంతమంది అభ్యర్థులు సికార్‌లోని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, స్థానిక పోలీసులు దానిని సీరియస్‌గా తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎస్‌ఓజీ రంగంలోకి దిగి మొబైల్ చాట్‌లు, డిజిటల్ రికార్డులను విశ్లేషిస్తోంది.


లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షలో అవకతవకలు జరగడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం గెస్ పేపర్ మహిమేనా లేక దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఏదైనా ఉందా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com