International ‘Health & Environment’ Conference : హైదరాబాద్‌లో జూన్ 20న అంతర్జాతీయ ‘హెల్త్ & ఎన్విరాన్‌మెంట్’ కాన్ఫరెన్స్..!

షేర్ చేయండి:
International ‘Health & Environment’ Conference : హైదరాబాద్‌లో జూన్ 20న అంతర్జాతీయ ‘హెల్త్ & ఎన్విరాన్‌మెంట్’ కాన్ఫరెన్స్..!

సాక్షి లైఫ్ : ఆరోగ్య సేవలు పర్యావరణహితంగా ఉండాలనే లక్ష్యంతో భాగ్యనగరంలో ఒక భారీ అంతర్జాతీయ సదస్సుకు వేదిక సిద్ధమైంది. 'హెల్త్ & ఎన్విరాన్‌మెంట్ లీడర్‌షిప్ ప్లాట్‌ఫామ్' (H.E.L.P) ఆధ్వర్యంలో జూన్ 20 తేదీన హైటెక్ సిటీలోని యశోదా హాస్పిటల్స్‌లో ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

 

బ్రోచర్‌ను ఆవిష్కరించిన నిమ్స్ డైరెక్టర్.. 

ఈ సదస్సుకు సంబంధించిన అధికారిక బ్రోచర్‌ను నిమ్స్ (NIMS) డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగం పర్యావరణంపై చూపుతున్న ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రోచర్‌ను హెల్ప్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ లింగయ్య, తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ మార్త రమేష్‌ లు పాల్గొన్నారు.

సదస్సు ప్రధాన ఉద్దేశాలు..

ఆరోగ్య వ్యవస్థల్లో సుస్థిరత (Sustainability) అమలు చేసే మార్గాలపై ఈ కాన్ఫరెన్స్‌లో విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రుల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడం.
పర్యావరణ అనుకూలమైన (Sustainable) హాస్పిటల్ డిజైన్లు, గ్రీన్ ప్రొక్యూర్‌మెంట్.

నీటి వినియోగం, వ్యర్థ జలాల శుద్ధి, బయో-మెడికల్ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ. ఎనర్జీ సమర్థత కలిగిన పరికరాల వాడకంపై అవగాహన.

సస్టైనబిలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్.. 

ఆరోగ్య రంగంలో పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన సంస్థలను గుర్తించి, ఈ వేదికపై “H.E.L.P సస్టైనబిలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్” ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుల కోసం నామినేషన్లు పంపడానికి జూన్ 10, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు.

అంతర్జాతీయ సంస్థల సహకారం.. 

ఈ సదస్సు నిర్వహణలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI), సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ హెల్త్, గ్లోబల్ గ్రీన్ అండ్ హెల్తీ హాస్పిటల్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయని డాక్టర్ మార్త రమేష్ తెలిపారు. వైద్యులు, ఆసుపత్రి నిర్వాహకులు, పాలసీ మేకర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాల కోసం.. ఆసక్తి కలిగిన వాళ్లు యశోదా హాస్పిటల్స్ వెబ్‌సైట్ లేదా greenhospitalsindia.org ను సందర్శించవచ్చు.

 

ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.