సాక్షి లైఫ్ : విటమిన్ కె అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్. ఇది ఎముకలు, గుండె ,మెదడు పనితీరులోను, కాలేయ సమస్యలు, లివర్ సిర్రోసిస్‌తో బాధపడేవారికి ఉపయోగపడే విటమిన్. ఒకవేళ శరీరంలో కె విటమిన్ లోపిస్తే ఈ కింది వాటిని తీసుకోవడం ద్వారా ఆ లోపాన్ని భర్తీ చేయవచ్చు.
విటమిన్ కె లోపాన్ని ఈ ఆహారాలతో భర్తీ చేయవచ్చు..
ఆకు కూరలు
ఆవాలు, పాలకూర
గోధుమ బార్లీ
ముల్లంగి, బీట్రూట్
అరటిపండు
మొలకెత్తిన ధాన్యాలు
గుడ్లు
మాంసం
ఇది కూడా చదవండి.. కొబ్బరి నీళ్లతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో..
అవకాడో..
అవకాడోలో విటమిన్ కె ఉండటం వల్ల ఎముకలకు చాలా మేలు చేస్తుంది. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి, ఇవి గుండెకు మేలు చేస్తాయి. అంతేకాకుండా, ఇది గట్ కి, ఆరోగ్యకరమైన బరువుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఎర్ర ముల్లంగి..
ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో విటమిన్ కెతో పాటు పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఎముకలు, గుండె, కళ్ళు ,అధిక రక్తపోటు నుంచి రక్షించడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. ఇందులోఉండే ఫైబర్ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
పాలకూర..
ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండే ఆకు కూరల్లో పాలకూర ఒకటి. ఇందులో విటమిన్-కె, విటమిన్-ఎ, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు, ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది, ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని, రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గాయాలను త్వరగా నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.
బ్రోకలీ..
విటమిన్ కె తోపాటు అనేక ఇతర విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లు బ్రోకలీలో ఉన్నాయి. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థ ను పెంచుతాయి. కడుపులో మంట, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడడమేకాకుండా మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
కాలే ..
కాలేలో విటమిన్ కె పెద్ద పరిమాణంలో లభిస్తుంది. అదనంగా, విటమిన్ సి విటమిన్ ఇ కూడా ఇందులో ఉన్నాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది కాకుండా, గుండె జబ్బులు, క్యాన్సర్‌ను నివారించడంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎముకలు, దంతాలకు అవసరమైన క్యాల్షియం కూడా కాలేలో లభిస్తుంది.
ఇది కూడా చదవండి.. విటమిన్ కె లోపంవల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com