విటమిన్ కె లోపంవల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే..? అన్ని రకాల పోషకాలు అవసరం. ఆరోగ్యంగా ఉండంలో అనేక విటమిన్లు, ఖనిజాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ కె కూడా ఈ ముఖ్యమైన పోషకాలలో ఒకటి. దీని లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని లక్షణాల ద్వారా మీరు ఆ లోపాన్ని గుర్తించవచ్చు. అవేంటంటే..?  

శరీరంలో ఏ ఒక్క విటమిన్ లోపించినా అది అనారోగ్యానికి గురి చేస్తుంది. విటమిన్ కె ఈ పోషకాలలో ఒకటి. కె విటమిన్ లోపం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది మన శరీరంలో అనేక విధాలుగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే దీని ప్రాముఖ్యతను విస్మరించలేము. అయితే కొన్ని కారణాల వల్ల శరీరంలో కె విటమిన్ లోపం తలెత్తుతుంది.  శరీరంలో దాని లోపాన్ని గుర్తించడం, వెంటనే దానిని పరిష్కరించడం చాలా ముఖ్యం. 

విటమిన్ కె లోపిస్తే కనిపించే లక్షణాలు..?

విటమిన్ కె అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్. ఇది ఎముకలు, గుండె ,మెదడు పనితీరులో ఉపయోగపడుతుంది. కాలేయ సమస్యలు , లివర్ సిర్రోసిస్‌తో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది. ఒకవేళ  శరీరంలో కె విటమిన్ లోపిస్తే అనేక తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి. ఆయా లక్షణాల ద్వారా శరీరంలో విటమిన్ కె లోపాన్ని గుర్తించవచ్చు.
 ఇది కూడా చదవండి..స్టెరాయిడ్స్ వాడితే ఏమౌతుందో తెలుసా..?  


చిన్నపాటి గాయాలకే అధిక రక్తస్రావం
ముక్కు నుంచి రక్తం కారుతుంది
మహిళల్లో అధిక ఋతుస్రావం
ఎముకల సాంద్రత తగ్గుతుంది
 తరచుగా కీళ్లు , ఎముకల నొప్పి
చిన్న గాయం పెద్ద గాయంగా మారుతుంది
 గాయం తొందరగా నయం కాదు
 చిగుళ్ళలో రక్తస్రావం
దంతాల బలహీనత
దంతాలు ,చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు 
 విటమిన్ కె లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి. 

విటమిన్ కె మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. దీని లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. మీ శరీరం ఈ ముఖ్యమైన పోషకంలో లోపిస్తే, ఈ కింది అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.  

ఇది కూడా చదవండి.. రెండు రకాల క్యాప్సూల్స్ అమ్మకాలపై నిషేధం..కారణం ఇదే..   

ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణించడం
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ)
ఆస్తమా
అలెర్జీ బ్రోన్కైటిస్
ఊపిరితిత్తులలో గురకకు కారణమయ్యే ఏదైనా రకమైన వ్యాధి
ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం
ఊపిరితిత్తుల శ్వాసకోశ పనితీరు తగ్గడం

ఇది కూడా చదవండి.. కొబ్బరి నీళ్లతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో..   

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.