మీ పిల్లలు స్మార్ట్ ఫోన్‌ కి అడిక్ట్‌ అవుతున్నారా..? ఎలా కంట్రోల్ చేయాలంటే..?   

సాక్షి లైఫ్ : తమ పిల్లలు ఫోన్ కి ,టీవీకి అడిక్ట్ అయిపోయారని కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. పుస్తకం ముట్టుకోవడానికి ఇష్టపడం లేదంటూ వాపోతున్నారు మరికొంత మంది పేరెంట్స్. నిజానికి మనం నేర్పే వాటినే పిల్లలు నేర్చుకొంటారు. మన ప్రమేయం లేకుండా పిల్లలు, ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు ఏదీ నేర్చుకోరు కూడా..

ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వొద్దు. “ అది పెద్దల కోసం.. అవసరానికి మాత్రం వినియోగించడానికి “ అని చెప్పండి.
మీరు టీవీ ముందు, సెల్‌ఫోన్‌తో గడిపే కాలాన్ని తగ్గించండి.
ఆసక్తి కలిగిన పుస్తకాలు చదవండి. పిల్లలు దాన్ని అనుకరిస్తారు.
పిల్లలతో సమయం గడపండి. వారికి రకరకాల ఆటలు నేర్పండి. వారితో ఆడండి.

పిల్లలకు కథలు చెప్పండి. దాని గురించి వారితో చర్చించండి. దీని వల్ల క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. అన్నిటికీ మించి మీ పిల్లలు మీరు చెప్పింది వినడం చేస్తారు. పెద్దయ్యాక కూడా ఇది కొనసాగుతుంది . మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు .

పిల్లలు ఆకలేస్తే తింటారు. కడుపులో నులిపురుగులు లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆకలి తగ్గుతుంది. దానికి ట్రీట్మెంట్ అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు. 

నాలుగు గంటలకు స్వీట్స్ ఐస్ క్రీం లాంటి హై కెలొరీ ఫుడ్ ఇచ్చి, మరో మూడు గంటల్లో అన్నం తినమంటే తినరు. పిల్లల్ని అన్నం తినిపించే పేరుతో ఏదైనా చేసి వారికి తినడంపైన ఆసక్తి పోయేలా చేయవద్దు.
 పిల్లల్ని జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచమని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు.
 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags :

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com