Hormonal Balance : కొలెస్ట్రాల్‌ తగ్గితే.. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఈ మధ్య కాలంలో రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం అనేది పెద్ద ఆందోళనగా మారింది. గుండె ఆరోగ్యం కోసం కొలెస్ట్రాల్‌ను తగ్గించు కోవాలని చాలామంది నూనెలు, కొవ్వు పదార్థాలకు ఆమడదూరం ఉంటున్నారు. అయితే, కొలెస్ట్రాల్‌ను పూర్తిగా శత్రువుగా చూడటం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత (Hormonal Balance) దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

కొలెస్ట్రాల్‌, హార్మోన్ల మధ్య లింక్..? 

మన శరీరంలో కొలెస్ట్రాల్ అంటే కేవలం 'కొవ్వు' మాత్రమే కాదు, అది ఒక ముఖ్యమైన నిర్మాణ సామాగ్రి. శరీరంలోని కీలక హార్మోన్లయిన ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్ , కార్టిసాల్ వంటివి తయారవ్వాలంటే కొలెస్ట్రాల్ అత్యవసరం. ఎముకల బలానికి కావాల్సిన విటమిన్ డి ఉత్పత్తికి కూడా కొలెస్ట్రాల్ మూలాధారం. మనం కొలెస్ట్రాల్‌ను మరీ తగ్గించేస్తే, ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి నీరసం, మానసిక ఆందోళన, సంతానలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి.

హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటే కనిపించే సంకేతాలు.. 

విపరీతమైన అలసట, తగినంత నిద్ర ఉన్నా రోజంతా నీరసంగా అనిపించడం.మానసిక మార్పులు అంటే.. చిన్న విషయాలకే చిరాకు, డిప్రెషన్ రావడం.
కొవ్వు తక్కువగా తిన్నా అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం. జుట్టు, చర్మ సమస్యలు, చర్మం పొడిబారడం, జుట్టు విపరీతంగా రాలడం.

హార్మోన్ల బ్యాలెన్స్ కోసం ఇవి పాటించండి..

కొలెస్ట్రాల్ అదుపులో ఉంటూనే హార్మోన్లు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు అవసరం. కొవ్వులను పూర్తిగా మానేయకుండా.. బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు, ఆలివ్ ఆయిల్ వంటి 'గుడ్ ఫ్యాట్స్' (HDL) ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) సహజంగానే తగ్గుతుంది. కేవలం డైటింగ్ మీద ఆధారపడకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది.

అధిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ పెరిగి కొలెస్ట్రాల్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తుంది. యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మందులు వాడేవారు లేదా కఠినమైన డైట్ పాటించేవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి హార్మోన్ల స్థాయిని కూడా పరీక్షించుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.