Health and Happiness : హార్మోన్ల సమన్వయంతోనే హెల్త్ అండ్ హ్యాపీనెస్..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనం ఎవరినైనా ఇష్టపడినప్పుడు లేదా ప్రేమిస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, పులకింత కలిగినట్లు అనిపించడం సహజం. అయితే ఇవన్నీ కేవలం భావాలు మాత్రమే కావు.. మన మెదడులో జరిగే అద్భుతమైన రసాయనిక చర్యలు. ఈ రసాయనాలు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

కార్టిసోల్,ఒత్తిడి కారకం..

మన శరీరంలో 'కార్టిసోల్' అనే హార్మోన్ ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది మనల్ని అప్రమత్తం చేస్తుంది. అయితే, ఈ హార్మోన్ స్థాయిలు శరీరంలో ఎక్కువ కాలం పాటు అధికంగా ఉంటే.. అది మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రం (Hippocampus)పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల నిద్రలేమి, జీర్ణక్రియ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి సంభవిస్తాయి.

జంటగా ఉంటే.. తగ్గుతున్న ఒత్తిడి.. 

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (UC Davis) పరిశోధకుల అధ్యయనం ప్రకారం, భాగస్వామితో కలిసి సంతోషకరమైన క్షణాలను పంచుకోవడం వల్ల శరీరంలో కార్టిసోల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతున్నట్లు తేలింది. ఒంటరిగా పొందే ఆనందం కంటే, ఇద్దరూ కలిసి పంచుకునే ఆనందం ఒత్తిడిని 50శాతం వరకు తగ్గిస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు..

ఒత్తిడి తగ్గినప్పుడు చర్మం కాంతివంతంగా మారుతుంది, వాపులు (Inflammation) తగ్గుతాయి, హాయిగా నిద్ర పడుతుంది. అనుబంధాల తీరు (Attachment Styles)..మనం ఇతరులతో ఎలా బంధాన్ని పెంచుకుంటామనేది మన చిన్ననాటి అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. సురక్షిత బంధం (Secure).. వీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు, అనుబంధంలో ప్రశాంతంగా ఉంటారు.

ఆందోళన బంధం (Anxious).. తమ భాగస్వామి ఎక్కడ దూరమ వుతారో అన్న భయం వీరిలో కార్టిసోల్ స్థాయిలను పెంచుతుంది. దూరంగా ఉండే తత్వం (Avoidant): అతిగా దగ్గరవ్వడం వల్ల తమ స్వేచ్ఛ పోతుందేమోనని వీరు భయపడతారు. ఈ భిన్నమైన మనస్తత్వాలు ఉన్నవారు జంటగా మారినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

ప్రేమ అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదు.. 

ప్రేమ అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, అది ఒకరినొకరు రక్షించుకునే (Co-regulation) ప్రక్రియ. ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా భాగస్వామితో కలిసి చిన్నపాటి ఆనందాన్ని పంచుకోండి. అది కలిసి నడవడం కావచ్చు లేదా ఒక సినిమా చూడటం కావచ్చు. నిజమైన ప్రేమ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయదు.. అది మన నాడీ వ్యవస్థకు (Nervous System) ప్రశాంతతను ఇస్తుంది.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.