Healthy Low-Carb, Low-Fat Diet : ఆరోగ్యకరమైన 'లో-కార్బ్, లో-ఫ్యాట్' ఫుడ్డే.. గుండెకు రక్షణ! మెటబాలిక్ ఆరోగ్యంపై తాజా పరిశోధన..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత యాంత్రిక జీవనంలో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. అయితే, మనం తీసుకునే ఆహారంలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పుల నుంచి తప్పించుకోవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ పిండి పదార్థాలు (Low Carb), తక్కువ కొవ్వు (Low Fat) కలిగిన ఆహారం గుండె పనితీరును మెరుగుపరచడమే కాకుండా, మెటబాలిక్ ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 

నాణ్యమైన ఆహార పదార్థాలతోనే సమతుల్యత..

సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు ఏదో ఒక రకమైన డైట్‌ను అనుసరిస్తుంటారు. కానీ, అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. నాణ్యమైన ఆహార పదార్థాలను ఎంచుకోవడం ద్వారానే దీర్ఘకాలిక ప్రయోజనాలు అందుతాయి.

పరిశోధనలో.. 

 పాలిష్ చేసిన రైస్, మైదా వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలకు బదులుగా.. తృణధాన్యాలు (Whole Grains), పీచు పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఆరోగ్యకరమైన కొవ్వు..

నూనెలో వేయించిన పదార్థాలను తగ్గించి, వీటికి బదులుగా నట్స్, గింజలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి.

గుండెకు మేలు..

 ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. తద్వారా గుండెపోటు ముప్పు గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

మెటబాలిక్ ఆరోగ్యం అంటే ఏమిటి..?

శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియనే మెటబాలిజం అంటారు. రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, నడుము చుట్టుకొలత అదుపులో ఉండటమే మెటబాలిక్ ఆరోగ్యానికి నిదర్శనం. ఈ కొత్త డైట్ విధానం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి, టైప్-2 డయాబెటిస్ రాకుండా నిరోధించవచ్చు.

 డైట్ అనగానే..

డైట్ అనగానే ఆహారాన్ని పూర్తిగా మానేయడం కాదు, సరైన రకమైన ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. తక్కువ పిండి పదార్థాలు తీసుకునే సమయంలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు అందుతున్నాయా లేదా అన్నది గమనించుకోవాలి. ముఖ్యంగా పండ్లు, పప్పుధాన్యాలు, ఆకుకూరలను దైనందిన ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిరుతిళ్లకు దూరంగా ఉంటూ, ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇస్తూ.. సరైన మోతాదులో వ్యాయామం తోడైతే గుండె పదిలంగా ఉంటుందని ఈ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.