Protein : ప్రోటీన్ ఏ సమయంలో తీసుకుంటే సరైన ఫలితాలు వస్తాయి..?
సాక్షి లైఫ్ : ప్రోటీన్ అంటే కేవలం జిమ్‌కు వెళ్లేవారికి మాత్రమే అవసరమని చాలామంది భావిస్తారు. కానీ, మన శరీరంలోని కణాల మరమ్మతులకు, రోగనిరోధక శక్తి పెంపునకు ప్రతిరోజూ తగినంత ప్రోటీన్ తీసుకోవడం తప్పనిసరి. అయితే, దీనిని తీసుకునే 'సమయం' కూడా అంతే ముఖ్యం.
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో..
రాత్రంతా నిద్రలో ఉండటం వల్ల మన శరీరం సుమారు 8 నుండి 10 గంటల పాటు ఆహారానికి దూరంగా ఉంటుంది. ఉదయాన్నే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం గుడ్లు, మొలకెత్తిన గింజలు లేదా పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండి, రోజంతా అతిగా తినాలనే కోరిక కలగదు.
శరీర మెటబాలిజం మెరుగుపడి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. వ్యాయామం తర్వాత (Post-Workout) వర్కవుట్ ముగిసిన 30 నుంచి 45 నిమిషాల లోపు ప్రోటీన్ తీసుకోవడం ఉత్తమం. ఈ సమయంలో కండరాలు ప్రోటీన్‌ను త్వరగా గ్రహించి, వ్యాయామం వల్ల కలిగిన అలసటను, కండరాల ఒత్తిడిని తగ్గిస్తాయి.
నిద్రపోయే ముందు..
రాత్రి పడుకునే ముందు తక్కువ మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల నిద్రలో కండరాల పునరుద్ధరణ (Muscle Recovery) వేగంగా జరుగు తుంది. ముఖ్యంగా 'కేసిన్' వంటి నెమ్మదిగా జీర్ణమయ్యే ప్రోటీన్ పాలు లేదా పెరుగు రాత్రివేళ మంచిది.
ఒక్కసారిగానా..?
చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే.. రోజంతా తీసుకోవాల్సిన ప్రోటీన్‌ను ఒక్క పూటలోనే ముఖ్యంగా రాత్రి భోజనంలో తీసు కుంటారు. కానీ పరిశోధనల ప్రకారం మన శరీరం ఒకేసారి అధిక మొత్తంలో ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోలేదు. కాబట్టి, ప్రోటీన్‌ను ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమాన విడతలుగా పంచుకుని తీసుకోవడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అవసరానికి మించి ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వయస్సు, బరువు, శారీరక శ్రమను బట్టి నిపుణుల సలహాతో సరైన మోతాదును నిర్ణయించుకోవాలి.
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
