పిల్లల్లో ఆస్తమా లక్షణాలు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కొన్నిరకాల వైరస్లు ఊపిరితిత్తుల సమస్యలకు ప్రధాన కారణమవుతున్నాయి. ఇలాంటి వైరస్లు సోకడం వల్లే ఆస్తమాకు ప్రధాన కారణంగా మారుతున్నాయి.సెకండ్ హ్యాండ్ సిగరెట్ స్మోక్, అంటే ఇతర వ్యక్తులు సిగరెట్ తాగినప్పుడు వెలువడే పొగ కూడా ఆస్తమాకు ఒక ముఖ్యమైన కారణం. ధూమపానం చేయని వారితో పోలిస్తే ధూమపానం చేసేవారి పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.  

"ఆస్తమా "దీనినే "ఉబ్బసం" అని కూడా అంటారు. ఇది పెద్దలకు మాత్రమే కాదు. పిల్లలకు కూడా వస్తుంది. ఈ సమస్య తలెత్తడానికి చాలా కారణాలు ఉన్నాయి. సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే, అది మరింత తీవ్రమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.  
 
పిల్లల్లో ఆస్తమా లక్షణాలు ఎలా గుర్తించాలి..?  

ఆస్తమాతో బాధపడుతున్న పిల్లలకు తరచుగా దగ్గు ,శ్వాస సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఛాతి బిగుతుగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి పీల్చుకునేటప్పుడు ఈలవేసినట్లు శబ్దం రావడం, దీర్ఘకాలంగా గురక, దగ్గు రావడం, సీజనల్ ఇన్ఫెక్షన్స్, అలెర్జీలు కూడా ఆస్తమా తలెత్తడానికి ప్రధాన లక్షణాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.