పిల్లల ఆరోగ్యం విషయంలో విటమిన్ "డి" ప్రాముఖ్యత

షేర్ చేయండి:
 పిల్లల ఆరోగ్యం విషయంలో విటమిన్ "డి" ప్రాముఖ్యత

సాక్షి లైఫ్: సాక్షి లైఫ్: పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ "డి" పాత్ర చాలా ముఖ్యమైనది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు, వివిధ శారీరక ప్రక్రియలతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో "డి" విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు విటమిన్ "డి" వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.  

 ఇతర విటమిన్ల మాదిరిగా.. 

సమతుల ఆహారం పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి ,రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని నిర్ధరిస్తుంది. విటమిన్ "డి" వంటివి ఆహారం ద్వారా అందక పోవచ్చు. ఇతర విటమిన్ల మాదిరిగా, విటమిన్ "డి" సాధారణంగా రోజువారీగా మనం తీసుకునే ఆహారాలలో అందుబాటులో ఉండదు. అటువంటి పరిస్థితిలో, దీనిని పొందడానికి, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

 విటమిన్ "డి" ప్రాముఖ్యత.. 

విటమిన్ "డి"ని సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. పిల్లల బలం ,అభివృద్ధికి ఇది చాలా ముఖ్యం. ఇది కొవ్వులో కరిగే విటమిన్ . ఎముకల బలానికి మాత్రమే కాదు. ఇది హార్మోన్ రూపంలో వివిధ శారీరక విధులను కూడా ప్రభావితం చేస్తుంది.

ఎముకలు-కండరాలను బలోపేతం చేయడంలో.. 
 
విటమిన్ "డి"ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి శరీరంలో కాల్షియం, ఫాస్ఫేట్ వంటి అవసరమైన మినరల్స్ ను పెంచడానికి 'డి " విటమిన్స్ తోడ్పడుతుంది. అంతేకాదు ఎముకలు, కండరాలను దృఢంగా ,ఆరోగ్యంగా మార్చడమే కాకుండా, రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది.  

చక్కెరను కిలోగ్రాములలో, పాలను లీటర్లలో కొలిచినట్లే, విటమిన్లను  ఇంటర్నేషనల్ యూనిట్లు(IU)లో కొలుస్తారు.

అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) ప్రకారం.. ప్రతిరోజూ నవజాత శిశువులకు 400 IUలు, పిల్లలు, పెద్దలకు 600 IUల విటమిన్ "డి" అవసరం. రోజూ సరైన మోతాదులో విటమిన్ "డి" తీసుకోవడం వల్ల వారి ఎముకలు బలపడతాయి. 

అనేక రకాల సమస్యలు.. 

విటమిన్ "డి " లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.   కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైన లక్షణాలు విటమిన్ "డి" లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి విటమిన్ "డి" తీసుకోవడం చాలా ముఖ్యం.

విటమిన్ "డి"ని ఎలా పొందాలి..?  

సూర్యకాంతి.. 

సూర్యకాంతి ద్వారా విటమిన్ "డి"ని పొందవచ్చు. ప్రతిరోజూ కేవలం 15-20 నిమిషాలు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా ఉంటే విటమిన్ "డి" పుష్కలంగా లభిస్తుంది.

సరైన ఆహారపు అలవాట్లు.. 

ఆహారంలో కొన్ని బలవర్ధకమైన ఆహారాలు తప్పనిసరిగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. అటువంటి వాటిలో చేపలను మీ  ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కూడా విటమిన్ "డి" పొందవచ్చు. 250ml బలవర్ధకమైన పాలలో 100 ఇంటర్నేషనల్ యూనిట్ల (IU) విటమిన్ "డి" లభిస్తుంది.  

 
-సూర్యరశ్మిని పొందలేని వారికి విటమిన్ "డి" సప్లిమెంట్లు మంచి మూలం.  

-బలవర్థకమైన పాలు: పోషకాహార ప్రారంభానికి ఒక గ్లాసు పాలు (200 ml).

-కొవ్వు చేపలు : మాంసాహారులకు మాకేరెల్ (బాంగ్డా)/హిల్సా వంటి చేపలు.

-పుట్టగొడుగులు : శాఖాహారులకు మంచి ఎంపిక.

ఫోర్టిఫైడ్ లస్సీ, మజ్జిగ తీసుకోవడం ద్వారా విటమిన్ "డి" లభిస్తుంది.  

 

 ఇది కూడా చదవండి..  హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..

 
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.