ఊబకాయం ప్రాణాంతకమా..? ఎందుకు..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఊబకాయం అనేక ప్రాణాంతక వ్యాధులకు మూలం. ఎందుకంటే దీని కారణంగా అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ఊబకాయ నివారణకు కీలకం. ఊబకాయం.. నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య. కేవలం సౌందర్యపరమైన సమస్యగానే కాకుండా, ఇది అనేక ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరి స్తున్నారు.ఊబకాయం వల్ల కలిగే ప్రమాదాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

ఊబకాయం స్వయంగా ఒక వ్యాధి అని, దీన్ని తీవ్రంగా పరిగణించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన బరువు ఉంటేనే సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వీలుకలుగుతుంది. 

ఊబకాయంతో వచ్చే వ్యాధులు..  

మధుమేహం (షుగర్): అధిక బరువు ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.
రక్తపోటు (బీపీ): అధిక బరువు గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.
గుండె జబ్బులు: గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలు పెరుగుతాయి.
ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం): కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.


కీళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్: అధిక బరువు కీళ్లపై భారాన్ని పెంచుతుంది.
మానసిక వ్యాధులు: డిప్రెషన్, ఆందోళన వంటివి కూడా ఊబకాయుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
అంతేకాకుండా, ఊబకాయం వల్ల సెక్సువల్ హెల్త్ కూడా ప్రభావితం అవుతుంది. ఊబకాయం ఉన్న మహిళలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని, పురుషులలో శుక్రకణాల నాణ్యత తగ్గవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.