శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
సాక్షి లైఫ్ : శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు, ఇది శరీరంలో అవసరమైనంత వరకే ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు అనారోగ్యానికి కారణమవుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తుతాయంటే..? కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు రక్తప్రవాహానికి అవరోధం కలిగిస్తుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం మరింతగా పెరుగుతుంది.కొలెస్ట్రాల్ పెరగడంవల్ల గుండెకు రక్తం సరఫరా తగ్గి, గుండెపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
హైపర్టెన్షన్..
కొలెస్ట్రాల్ అధికమైనప్పుడు నరాలు కుంచించుకుపోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీని కారణంగా హైపర్టెన్షన్ (హైబ్లడ్ ప్రెజర్)పెరుగుతుంది. సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, సరిగ్గా ఆహారం తినడం, వ్యాయామం చేయడం, డాక్టర్ తో సలహా తీసుకోవడం, అవసరమైన చికిత్సలు తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయట పడొచ్చు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు మంచి జీవనశైలి అలవాట్లు కూడా చాలా ముఖ్యం. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మం పసుపు రంగులోకి మారుతుంది. కొందరిలో ముఖంలో వాపు కనిపిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని తెలిపే సంకేతాలు ఒక్కోసారి ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపించే అవకాశం ఉంది. చర్మం రంగులో మార్పులు, కళ్లు పలుపురంగులోకి మారడం, కళ్ల చుట్టూ పసుపు మచ్చలు, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ విషయంలో కొన్నిసందర్భాల్లో కనిపిస్తాయి.
ఈ లక్షణాలను గమనించిన వెంటనే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. చెడు కొలెస్ట్రాల్‌కు సంబంధించిన సమస్యలను సకాలంలో గుర్తించడం ద్వారా సమస్య తీవ్రం అవ్వకుండా ముందుగా జాగ్రత్త పడొచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
బ్యాడ్ కొలెస్ట్రాల్..
బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. సమస్య ప్రారంభం కాకముందే కొన్నిరకాల సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఆయా లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి వీలుకలుగుతుంది.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
